OYO Rooms | పెళ్లి కాని జంటలకు ఓయో హోటల్స్ బ్యాడ్ న్యూస్..

అన్ని వర్గాల ప్రజలకు హోటల్ రూములను చేరువ చేసే ఉద్దేశంతో ఓయోను తీసుకువచ్చారు. అయితే తమ లక్ష్యానికి విరుద్ధంగా కొన్నిచోట్ల జరుగుతున్న వ్యవహారాలతో సంస్థకు చెడ్డ పేరు వస్తుండడంతో ఈ సంస్థ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా యువతీ, యువకులకు రూములను కేటాయించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ఓయూ సంస్థ ఇకపై ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ముఖ్యంగా పెళ్లి కాని జంటలకు ఓయో రూములు ఇవ్వకూడదని తాజాగా నిర్ణయం తీసుకుంది.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

ఓయో రూములు అంటే చాలా మందికి ఒక భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. ఇక్కడకు వెళ్లే వారంతా యువతే ఉంటున్నారన్న అపోహ చాలా మందిలో ఉంది. అనేక చోట్ల యువతి, యువకులే ఎక్కువగా ఓయో రూములకు వెళుతున్నారు. వీరిలో ఎక్కువమంది ప్రేమికులు ఉంటున్నారు అన్న ప్రచారం ఉంది.  అయితే, అన్ని వర్గాల ప్రజలకు హోటల్ రూములను చేరువ చేసే ఉద్దేశంతో ఓయోను తీసుకువచ్చారు. అయితే తమ లక్ష్యానికి విరుద్ధంగా కొన్నిచోట్ల జరుగుతున్న వ్యవహారాలతో సంస్థకు చెడ్డ పేరు వస్తుండడంతో ఈ సంస్థ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా యువతీ, యువకులకు రూములను కేటాయించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ఓయూ సంస్థ ఇకపై ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ముఖ్యంగా పెళ్లి కాని జంటలకు ఓయో రూములు ఇవ్వకూడదని తాజాగా నిర్ణయం తీసుకుంది. హోటల్స్ లో దిగేవారికి కొత్త చెక్ ఇన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై అవివాహిత జంటలకు హోటల్లో గది ఇవ్వబోరు.

ఈ మేరకు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే ఇక మీదట పెళ్లికాని జంటలు గదిని బుక్ చేసుకునేందుకు వీలు ఉండదు. ఈ నిబంధనలు తొలుత మేరర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఓయో సంస్థ సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు జంటలు పెళ్లి ధ్రువపత్రాలు/రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా వివాహాన్ని నిర్ధారించే గుర్తింపు పత్రాలను తీసుకుని రావాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. మేరర్ లోని తన భాగస్వామ్య హోటల్లో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాము సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిధ్య విధానాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఉత్తర భారత రీజియన్ అధిపతి పవాస్ శర్మ వెల్లడించారు. అందులో భాగంగానే తాజాగా చెక్ - ఇన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. 

ఈ మధ్యకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓయోపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. జరగకూడని వ్యవహారాలకు ఓయో రూములు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ప్రచారాలకు, ఆరోపణలకు చెక్ చెప్పేందుకు అనుగుణంగా సంస్థ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై చట్టబద్ధంగా వచ్చే జంటలకు మాత్రమే ఓయూ రూములు అద్దెకి ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా అడ్డగోలు వ్యవహారాలకు తాము ఆతిథ్యం ఇవ్వబోమన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు అయింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఓయో రూములు బుక్ చేసుకునే వారిలో ఇప్పటి వరకు అత్యధికంగా యువతీ, యువకులే ఉంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ఈ సంస్థ బిజినెస్ ఎంత వరకు విజయవంతంగా ముందుకు వెళుతుందన్న దానిపైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి ఏమవుతుందో.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్