తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎప్‌సెట్-2025కు సంబంధించి ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన విడుదల చేసింది. అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 19 నుంచి విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇంజనీరింగ్ స్ర్టీమ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం మూడు గంటలు నుంచి పరీక్ష తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎప్‌సెట్-2025కు సంబంధించి ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన విడుదల చేసింది. అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 19 నుంచి విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇంజనీరింగ్ స్ర్టీమ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం మూడు గంటలు నుంచి పరీక్ష తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30న ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
అలాగే, ఇంజనీరింగ్ స్ర్టీమ్ పరీక్షను మే రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షల నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక రెండు విభాగాలకు కలిపి 253 మంది దరఖాస్తు చేశారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసింది. పరీక్షా విధానం 160 మార్కులకు ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాసల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మ్యాథమెటిక్స్/బయాలజీ నుంచి 80 ప్రశ్నలకు 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, కెమిస్ర్టీ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పిస్తున్నారు.