మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లు.. అదనంగా 5000 బలగాలు

మణిపూర్లో శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకు మరింత క్షీణిస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతున్నట్టు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి నిరసనను తెలియజేస్తున్నారు. పలువురు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుండడంతో వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. సోమవారం కూడా కర్ఫ్యూ ఉల్లంఘించి మరీ పలువురు ఆందోళనకారులు యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.

Security forces patrolling in Manipur

మణిపూర్ లో పహారా కాస్తున్న భద్రత దళాలు

మణిపూర్లో శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకు మరింత క్షీణిస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతున్నట్టు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి నిరసనను తెలియజేస్తున్నారు. పలువురు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుండడంతో వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. సోమవారం కూడా కర్ఫ్యూ ఉల్లంఘించి మరీ పలువురు ఆందోళనకారులు యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలుపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి. జిరిబమ్ జిల్లాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు హత్యకు నిరసనగా కోకోమి (కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) గ్రూపునకు చెందిన కొందరు నేతృత్వంలో జనం ఇంపాల్ లోని పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబమ్ జిల్లాలో హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనకారులు ఇంపాల్ లోని చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ప్రధాన గేటుకు తాళం వేశారు. సమీపంలోని పలు కార్యాలయాలకు ఇదేవిధంగా తాళాలు వేశారు. అలాగే కుకి మిలిటెంట్లపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్ లో కోకిమి చేపట్టిన ధర్నా నాలుగో రోజుకి చేరింది. మరోవైపు ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వరుసుగా రెండో రోజు మణిపూర్ పై కేంద్ర, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనుగుణంగా మరో ఐదు వేల మంది పారా మిలటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి వెంటనే అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎడి సింగ్, ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంలో మకాం వేసి ఉన్నారు. గడిచిన వారం పంపిన కేంద్ర సిబ్బందితో కలిపి మొత్తం 218 కంపెనీల కేంద్ర సాయిధ పోలీసు బలగాలు ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నాయి.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మణిపూర్లో తాజాగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి మూడు కేసులను నమోదు చేసింది. జిరిబమ్ జిల్లాలో మహిళల హత్య సిఆర్పిఎఫ్ పోస్ట్ పై సాయుధ మూక దాడి, బొరెబెక్రలో ఇళ్ల దహనం, ఒకరి హత్యకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే ప్రధాని మోడీ కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో పర్యటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మణిపూర్ లో బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే మంగళవారం కూడా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లపైకి వచ్చి నిరసనను తెలియజేస్తున్నారు. పలువురు ఆందోళన కారులో ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుండడంతో సిఆర్పిఎఫ్ బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి. రెండు మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్రం చెబుతోంది. అందుకు అనుగుణంగానే మరో 5 వేల బలగాలను మణుపూర్లో కేంద్రం దించుతోంది. ఈ చర్యలన్నీ అల్లర్లు అదుపులోకి తీసుకువస్తాయని కేంద్రం భావిస్తోంది. పరిధి దాటే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మేరకు ఆ రాష్ట్ర అధికారులతోపాటు కేంద్ర అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు. ఏదో ఏమైనా గడిచిన ఐదు రోజులుగా ఇక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎప్పటికీ మళ్ళీ సాధారణ పరిస్థితిలు ఏర్పడతాయోనన్న భయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్