మరోసారి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి.. బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు.!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళతారన్న అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన కొన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు.

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళతారన్న అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన కొన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి చవిచూస్తుండడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల పట్ల తీవ్ర విరక్తి పుట్టిన చిరంజీవి.. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో కూడా చేరలేదు. 2014 ఎన్నికల్లో తమ్ముడు తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు తెలియజేసిన చిరంజీవి తన స్పందన మాత్రం తెలియజేయలేదు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో కలిసి వంటరిగా బరిలోకి దిగిన అప్పుడు కూడా చిరంజీవి జనసేన తరఫున బరిలోకి దిగలేదు. బహిరంగంగా మద్దతు కూడా తెలియజేయలేదు. తాజాగా 2024 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన జనసేన తరఫునుంచి ఎక్కడ పోటీ చేయలేదు.

ఇప్పటివరకు జనసేన సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదు. కానీ, చిరంజీవి అంటే అమితమైన ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి తన అన్నను రాజ్యసభకు పంపించాలన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు చర్చలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను పెద్దలకు సభకు పంపించే వ్యూహం ఇందులో దాగి ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించాలని అంతా భావించారు. ఈ స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని అంతా అనుకున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీకే రెండు స్థానాలు దక్కాయి. అనూహ్యంగా నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే మరో బ్రదర్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలన్న పవన్ కళ్యాణ్ కోరికను బిజెపి ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బిజెపి సభ్యత్వం కూడా తీసుకోకుండానే ఈ కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్రపతి కోటాలో పలువురు ప్రముఖులను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి రాజ్యసభకు పంపిస్తారు. ఈ కోటాలో 12 మందిని ఎంపిక చేసే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. పేరుకు రాష్ట్రపతి ఎంపిక చేస్తారే గాని.. మొత్తం ప్రక్రియను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే నిర్వహిస్తుంది. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి రాజ్యసభకు పంపిస్తుంది. అందులో భాగంగానే చిరంజీవిని సినిమా రంగంలో నుంచి ఎంపిక చేసి రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దల వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో చిరంజీవి దిగ్గజ నటుడుగా ఎప్పుడో పేరు గడించారు. కాబట్టి చిరంజీవిని సినిమా రంగం నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలను కోరినట్లు చెబుతున్నారు. కొద్దిరోజులు కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులతో సమావేశం అయినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. బిజెపి పెద్దలు కూడా దీని పట్ల సానుకూలంగానే స్పందించినట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే చిరంజీవి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే 2024 ఎన్నికల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని ముగ్గురు కీలకమైన వ్యక్తులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చున్నట్లు అవుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మరో సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి బాధ్యతలను చేపట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహం ప్రకారం అనుకున్నది జరిగితే మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభలో అడుగు పెడతారు. ఇదంతా సక్రమంగా జరిగితే మాత్రం మెగాస్టార్ అభిమానులకు ఈ ఏడాది గుర్తింపు ఇయర్ గా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్