దేశంలో మరోసారి ఎన్నికలు.. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు మోగిన నగారా

దేశంలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారాను మోగించింది. ఈసారి మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 24 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్లో రెండు దశల్లో (నవంబర్ 13, 20 తేదీల్లో) ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Election Commission officials

షెడ్యూల్ విడుదల చేస్తున్న ఎన్నికల సంఘ అధికారులు

దేశంలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారాను మోగించింది. దేశవ్యాప్తంగా లోక్ సభకు, ఏపీతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడవకముందే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకచోట కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి, మరోచోట బిజెపి విజయం సాధించాయి. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవక ముందే మరో ఎన్నికల నగారాను ఎన్నికల సంఘం మోగించింది. ఈసారి మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 24 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్లో రెండు దశల్లో (నవంబర్ 13, 20 తేదీల్లో) ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నేత రాహుల్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన వయనాడ్ (కేరళ) తోపాటు నాందేడ్ (మహారాష్ట్ర) లోక్సభ స్థానాలకు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13, 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న, ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరి 5న ముగుస్తుంది. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చారు. నామినేషన్లు ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఉంది. ఝార్ఖండ్లో నవంబర్ 13న జరిగే స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 25 కాగా, నామినేషన్లను అక్టోబర్ 30లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 20న జరిగే స్థానాలకు నామినేషన్ల దాకులకు చివరి తేదీ అక్టోబర్ 29 కాగా, ఉపసంహరణకు నవంబర్ ఒకటి చివరి తేదీ. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే ఏడది ఫిబ్రవరి 15లోపు జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పుడే జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కోరినప్పటికీ ఈసీ పట్టించుకోలేదు. నిజానికి హర్యానా ఎన్నికలను కూడా మహారాష్ట్రతోపాటే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ తో కలిపి నిర్వహించింది.  జమ్మూ కాశ్మీర్ లో భద్రతా సమస్యల వల్ల మహారాష్ట్రను హర్యానా నుంచి వేరు చేసినట్లు సిఇసి వెల్లడించారు. 

మహారాష్ట్రలో పోరు హోరాహోరీ

నవంబర్లో జరగనున్న రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని  పరిశీలిస్తే మహారాష్ట్రలో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ ఎన్సిపి, కాంగ్రెస్ తో కూడిన మహా వికాస్ అఘాడీకి, బిజెపి, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవర్ ఎన్సిపితో కూడిన మహాయుతి కూటమికి మధ్య హోరాహోరి పోరు జరగనుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్  తమ వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిజెపి 48 సీట్లలో కేవలం 9 సీట్లు గెల్చుకోగా, మహా వికాస్ అఘాడి 30 సీట్లు గెలుచుకుంది. తాజాగా షిండే సర్కార్లో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 2019లో జార్ఖండ్ లో జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి. బిజెపి 25 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా జేఎంఎం, కాంగ్రెస్ కూటమి బిజెపి మధ్య పోటీ నెలకొంది. కాగా మహారాష్ట్రలో ఎన్నికలకు అతి తక్కువ సమయం ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేవలం 35 రోజులు సమయం ఇచ్చారని విమర్శిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్