గత కొన్నాళ్లుగా ఎలక్ట్రికల్ స్కూటీలు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న మోడల్స్ లో స్కూటర్లను పలు కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఒకవైపు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తుండగా, వాహన సంస్థలు కూడా భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. దసరా పండగ నేపథ్యంలో ఓలా కంపెనీ ఎలక్ట్రికల్ స్కూటీల విక్రయాలపై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు ధరను అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఎలక్ట్రికల్ స్కూటీ
గత కొన్నాళ్లుగా ఎలక్ట్రికల్ స్కూటీలు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న మోడల్స్ లో స్కూటర్లను పలు కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఒకవైపు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తుండగా, వాహన సంస్థలు కూడా భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. దసరా పండగ నేపథ్యంలో ఓలా కంపెనీ ఎలక్ట్రికల్ స్కూటీల విక్రయాలపై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు ధరను అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ స్కూటీ ధర రూ.75 వేల రూపాయలుగా ఉంది. ఈ స్కూటీపై రూ.25 వేలు తగ్గింపును ఆ సంస్థ ప్రకటించింది. తగ్గింపు ధర తరవాత ఈ ఎలక్ట్రికల్ స్కూటీ రూ.49,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు వాలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఎలక్ట్రికల్ స్కూటీ పై సీజన్ సేల్ ఆఫర్ ను అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రకటించారు. ఈ ఆఫర్ అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానుందని భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఓలా ఎస్ 1 అనేది ప్రముఖ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ.49,999 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ రెండో తేదీ రాత్రి వరకు ఓలా యశ్వంత్ ప్రారంభ ధర రూ.74,999గా విక్రయించారు.
ఇప్పుడు ఈ స్కూటీ ప్రారంభ ధర రూ.25 వేలు తగ్గింది. ఈ ఆఫర్ నవరాత్రి నుంచి దీపావళి వరకు వినియోగదారులకు మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఓలా కంపెనీకి సంబంధించి వివిధ మోడల్స్ లో స్కూటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓలా ఎస్ 1 ఎక్స్ మూడు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ స్కూటర్ లో కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 95 కిలో మీటర్లు రేంజ్ ను, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 151 కిలో మీటర్లు రేంజ్ ను, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 193 కిలోమీటర్లు రేంజిని అందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఓలా ఎస్ 1 ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.74,499 ప్రారంభం కానుంది. అలాగే వాళ్ళ ఎస్ 1 ఎయిర్ 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫైడ్ రేంజ్ 151 కిలోమీటర్లు గా ఉంది. ఓలా ఎస్ 1 ఎయిర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,07,499 నుంచి ప్రారంభం అవుతుంది. మరో మోడల్ ఓలా ఎస్ 1 ప్రో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఓలా ఎస్ 1 ప్రో 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో 195 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది ఈ ఈ గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు గా ఉంది ఆఫర్కు ముందు ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూం ధర ప్రారంభ ధర రూ.1,34,99 గా ఉంది. ఈ భారీ ఆఫర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని వినియోగదారులు ఓలా షోరూమ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ దసరాకు భారీగానే స్కూటర్ల విక్రయాలు జరుగుతాయని సంస్థకు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు.