నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. నందమూరి నట దిగ్గజం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకొని మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ను అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రశాంత వర్మ మోక్షజ్ఞ మూవీ తెరకెక్కించడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ గా రాబోతోంది.
జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. నందమూరి నట దిగ్గజం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకొని మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ను అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రశాంత వర్మ మోక్షజ్ఞ మూవీ తెరకెక్కించడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ గా రాబోతోంది. దీనిని ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలకృష్ణ చిన్న కుమార్తే మతుకుమిల్లి తేజస్విని కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పోస్టర్ విడుదలకు సంబంధించి టాలీవుడ్ అగ్ర నటులు, నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా మోక్షజ్ఞకు అభినందనలు తెలియజేశారు. మోక్షజ్ఞ పోస్టర్ విడుదలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు మోక్షు అంటూ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. నువ్వు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారి ఆశీర్వాదాలతోపాటు అన్ని దైవిక శక్తులు మీపై ఉంటాయి అని ఎన్టీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు. మరో నందమూరి వారసుడు మోక్షజ్ఞ సోదరుడైన నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞ పోస్టర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'టిన్షల్ టౌన్ కు మోక్షకు స్వాగతం. తాత గారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అనే కళ్యాణ్ రామ్ వీడు చేశారు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి విడుదలైన పోస్టర్ పై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు సోదరులు నందమూరి కుటుంబంతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల కిందట ముగిసిన ఎన్నికల్లోను వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి కూడా వెళ్లలేదు. బాలకృష్ణ కూడా వీరి గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుమారుడు సినిమా ఎంట్రీ పై ఇద్దరి నటులు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలపొంది. కుటుంబంలో ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ సరైన సమయంలో ఈ ఇద్దరి అగ్ర నటులు స్పందించిన తీరు నందమూరి అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది. అన్నయ్యలుగా తమ్ముడి సినిమా ఎంట్రీ పై వ్యాఖ్యలు చేసి వారి ప్రేమను తెలియజేశారు అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.