ఎన్టిపిసిలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్.. వేతనం ఎంత అంటే.!

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను ఎన్టిపిసి అందించింది. ఎన్టిపిసిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ఈ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి) లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం అందించనున్నారు. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ కాలేలా భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను ఎన్టిపిసి అందించింది. ఎన్టిపిసిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ఈ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి) లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం అందించనున్నారు. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ కాలేలా భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 25వ తేదీలోగా దరఖాస్తులను ఈ సంస్థ కోరుతోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో యుఆర్ పోస్టులు ఎనిమిది, ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఓబిసి 3, ఎస్సీ రెండు, ఎస్టీ అభ్యర్థులకు ఒక పోస్ట్ చొప్పున కేటాయించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిగ్రీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్) లేదా డిగ్రీతోపాటు డిప్లమో, పీజీ డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించరాదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబిసి అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపును ఈ సంస్థ ఇచ్చింది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభించింది. ఈ ఉద్యోగాలకు స్క్రీనింగ్, షార్ట్ లిస్ట్, సెలక్షన్ బోర్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు భారీగా వేతనం లభిస్తుంది. రూ.71 వేల రూపాయల వేతనాన్ని ఈ సంస్థ చెల్లించనుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ సంస్థ వెబ్సైట్ http://ntpc.co.in సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్