స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్‌.. భారీగా వేతనం

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ)లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు డిప్లొమో, బీటెక్‌, బీఈ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో పాసైన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ)లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు డిప్లొమో, బీటెక్‌, బీఈ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో పాసైన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) ఖాళీగా ఉన్న యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు. మే పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఈలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో పలు రకాల పోస్టులు ఉన్నాయి.

ఇందులో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 35 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఏప్రిల్‌ 25 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. విద్యార్థతను బట్టి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయసు 32 ఏళ్లకు మించరాదు. రూల్స్‌ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఉండాలి. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేలు వరకు వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌ పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మంచి వేతనం కావడంతో అభ్యర్థులు కూడా భారీగానే దరఖాస్తు చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ http://sportsauthorityofindia.nic.in సంప్రదించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్