రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 7,951 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 7,951 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులో 7,934 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్ పూర్, గుహవాటి, చెన్నై, ఛండీగఢ్, గోరఖ్ పూర్, జమ్ము అండ్ కాశ్మీర్, మాల్దా, బొంబాయి, పాట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, రీజియన్లలో ఉన్నాయి. మరో 17 కెమికల్ సూపర్ వైజర్ , రీసెర్చ్ అండె మెటలర్జికల్ సూపర్ వైజర్ పోస్టులున్నాయి.
అర్హతలు :
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
2025 జనవరి 1 నాటికి 18ఏండ్ల నుంచి 36ఏండ్లలోపు వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు దివ్యాంగులకు 10 నుంచి 15ఏండ్ల వయో సడలింపు ఉంటుంది.
ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.500 చెల్లించాలి. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలకు ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
జీతం:
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.35,400వేతనం ఉంటుంది. కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రారంభ వేతనంరూ.44,900 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం
అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు ఇవే :
జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తుల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే.. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు సవరించుకునే అవకాశం కల్పిస్తారు.