ప్రముఖ తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. గడచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా ఇడియోపతిక్ పల్మనరి ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. 73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ రెండు వారాల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
జాకీర్ హుస్సేన్
ప్రముఖ తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. గడచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా ఇడియోపతిక్ పల్మనరి ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. 73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ రెండు వారాల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయినా పరిస్థితి మెరుగుపరకపోవడంతోపాటు మరింత ఇబ్బందికరంగా మారడంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జాకీర్ హుస్సేన్ సోదరి కుర్సీద్ ఈ మరణాన్ని ధ్రువీకరించారు. ఉపాధ్యాయుడిగా, గురువుగా, అధ్యాపకుడిగా ఆయన చేసిన విశేష కృషి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందని, భవిష్యత్ తరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా స్ఫూర్తిని నింపాలని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక రాయబారిగా, గొప్ప వ్యక్తిగా విశిష్ట వారసత్వాన్ని మిగిల్చారు అని పేర్కొన్నారు. జాకీర్ హుస్సేన్ కు భార్య ఆంటోనియా మిన్నెకొలా, కుమార్తెలు అనిసా ఖురేషి, ఇషాబెల్ల ఖురేషి ఉన్నారు. జాకీర్ హుస్సేన్ భారత దేశంలోని అత్యంత ప్రజాధరణ పొందిన శాస్త్రీయ సంగీత కారులో ఒకరు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్ తబలా లెజెండ్ అల్లా రఖా కుమారుడు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరియర్లో ఆయన ఐదు గ్రామీ అవార్డులు సహా అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. గడిచిన ఏడాది కూడా మూడు అవార్డులు గెలుచుకున్నారు.
జాకీర్ హుస్సేన్ తన తబలా వాయిద్యంతో కోట్లాదిమంది మనసులను హత్తుకున్న సంగీత విద్వాంసుడుగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచడంతోపాటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటుగా ప్రముఖులు సంతాప సందేశాల్లో అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రికెట్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వ్యక్తం చేయడంతో పాటు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఎలా ఉంటే రెండేళ్ల క్రితమే జాకీర్ హుస్సేన్కు గుండెపోటు వచ్చింది. వైద్యులు స్టంట్ వేశారు. 2023లో పద్మ విభూషణతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. తరువాత మూడు గ్రామీ అవార్డులు అందుకున్నారు. 1951 మార్చి 9 ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ జాజ్ ఫ్యూజన్ లో, హిందుస్థాని క్లాసికల్ మ్యూజిక్ లో తన నైపుణ్యంతో అద్భుతాలను చేశారు. 11 ఏళ్ళకే సంగీత రంగ ప్రవేశం చేసిన జాకీర్ హుస్సేన్.. ఏడేళ్లకే తబలాతో కెరీర్ ప్రారంభించారు. 11 ఏళ్ళకే జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.