విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ తరహా కాల్స్ క్రమంగా వస్తూనే ఉన్నాయి. బెదిరింపు కాల్స్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నప్పటికీ ఈ తరహా కాల్స్ రావడం ఆగడం లేదు. ఇటువంటి కాల్స్ చేసే వారికి జీవిత ఖైదు విధించేలా చట్ట సవరణ చేస్తామని, నో ఫ్లై జాబితాలో చేర్చుతామని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బెదిరింపు కాల్ తో అత్యవసరంగా నిలిపిన విమానం
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ తరహా కాల్స్ క్రమంగా వస్తూనే ఉన్నాయి. బెదిరింపు కాల్స్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నప్పటికీ ఈ తరహా కాల్స్ రావడం ఆగడం లేదు. ఇటువంటి కాల్స్ చేసే వారికి జీవిత ఖైదు విధించేలా చట్ట సవరణ చేస్తామని, నో ఫ్లై జాబితాలో చేర్చుతామని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి హెచ్చరికల తర్వాత కూడా బెదిరింపుకోవాల్సి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రామ్మోహన్ నాయుడు ప్రకటన తర్వాత గడిచిన 24 గంటల్లో 79 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటిలో మంగళవారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు ఈ కాల్స్ వచ్చాయి. ఇండిగో విమానాలు 23, ఇస్తారా 21, ఆకాశ 12, ఎయిర్ ఇండియాకు చెందిన 23 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి వారం రోజుల్లో మొత్తం 169 విమానాలకు బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు వెల్లడించారు. బెదిరింపు కాల్స్ వస్తున్న విమానాల జాబితాలో జెడ్డా, ఇస్తాంబుల్, రియాజ్ వంటి అంతర్జాతీయ నగరాలకు వెళ్లే విమానాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకు 90కిపైగా బాంబు బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
మరోవైపు సిఆర్పిఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటిపై సీఆర్పీఎఫ్, నిఫ విభాగం, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఆకాశ్ (క్యూపి 1612) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం సాయంత్రం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు తనిఖీ బృందాలు సోదా చేసి బాంబు లేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి జోద్పూర్ వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ రావడంతో జోద్పూర్ లో దిగిన వెంటనే భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు కాల్స్ కారణంగా హైదరాబాదులో దిగాల్సిన రెండు విమానాలను విజయవాడకు తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాలు గాల్లో చక్కెర కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విమానంలో తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారు. గోవా నుంచి మధ్యాహ్నం హైదరాబాదు బయలుదేరిన ఇండిగో విమానాన్ని కూడా విజయవాడకు మళ్ళించారు. అది రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ తో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
దీనివల్ల సమయానికి లక్ష్యాలను చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బాంబు బెదిరింపులతో సిబ్బందికి కూడా ఇబ్బంది తప్పడం లేదు. రక్షణ సిబ్బంది తనిఖీలు నిర్వహించడం, ఎటువంటి బాంబులు లేవని తేల్చడం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ చేస్తున్న వారిపై ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడుతుందని పలువురు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించకపోతే ఈ తరహా కాల్స్ ను నియంత్రించడం సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి చెప్పినట్లుగా కఠినంగా వ్యవహరిస్తారా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం బాంబు బెదిరింపు కాల్స్ తో విమానాలు గమ్యాలను సకాలంలో చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.