వైసీపీ నుంచి టిడిపిలోకి ఆగని వలసలు.. అదే బాటలో మాజీ మంత్రులు

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన ఎంతోమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులు టిడిపి, జనసేనలోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Alla Nani, Sri Ranganatharaju

ఆళ్ల నాని, శ్రీ రంగనాథరాజు

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన ఎంతోమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులు టిడిపి, జనసేనలోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సర్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం మౌనాన్ని దాల్చిన మాజీ మంత్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కొద్ది రోజుల కిందటే పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొద్దిరోజుల్లోనే టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టిడిపికి చెందిన ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలోని కీలక నాయకులంతా పార్టీకి రాజీనామా చేశారు. ఆళ్ల నాని కూడా ఒకటి రెండు రోజుల్లో సైకిల్ ఎక్కేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగోసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిన ఆయన కొద్ది రోజులకే వైసీపీకి రాజీనామా చేశారు. తొలుత జనసేనలో చేరుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అలాగే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు టిడిపికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఆయన ఆస్తులు పై దాడులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం కంటే పార్టీ మారడం ఉత్తమం అన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలోకి ఆయనను తీసుకునే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. కానీ ఆయన టిడిపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజు కూడా వైసీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. కొద్దిరోజుల్లోనే ఆయన టిడిపిలో చేరతారని చెబుతున్నారు. ఈ మేరకు టిడిపి ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

టిడిపి అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో వైసిపి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నుంచి నాయకులు చేజారి పోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ క్యాడర్ చెబుతోంది. దీనిపై ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్లు చెబుతున్నారు. పార్టీ మారాలని భావిస్తున్న నేతలతో మాట్లాడాలంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వంటి వారికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయని, పార్టీ కష్ట కాలంలో అండగా ఉన్నవారికి అధికారంలోకి వచ్చినప్పుడు భరోసా కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఇబ్బందుల నుంచి క్యాడర్కు మానసిక స్థైర్యాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఆయన జనవరి నుంచి నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంతమంది నాయకులు వెళ్లిపోయిన కేడర్ బలంగా ఉందని విషయాన్ని కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఐదేళ్లు వైసిపికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్