టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్‌ను ఎన్నిక
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నోయల్ టాటా నియామకం
టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్‌ను ఎన్నుకుంటూ ట్రస్ట్ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.ఈయన రతన్ టాటాకు వరుసకు సోదరుడు అవుతారు. సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3వేల బిలియన్లకు పెంచారు.
నోయెల్ టాటా ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్కు వైస్ ఛైర్మన్గానూ ఉన్నారు. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ ల్లో అత్యధికంగా 67% వాటా ఉంది. అందువల్ల టాటా టస్ట్ల్కు చైర్మెన్ హోదాలో ఉన్న వ్యక్తి.. గ్రూపు కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటివరకు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా ఉన్నారు. ఆయన మరణంతో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ బాధ్యతలను నోయల్ టాటాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రతన్ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు నోయల్ టాటా. టాటా ట్రస్ట్స్ చైర్మన్‌పై 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు. వారంతా నోయెల్ టాటానే టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ చైర్మన్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరవ చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు.