ఉరుకుల, పరుగుల జీవితం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంత వరకు వివిధ రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని గడుపుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఒకవైపు ఉద్యోగ జీవితంలో ఉన్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. మరోవైపు కుటుంబాన్ని సాఫీగా నడిపించాల్సిన బాధ్యత చాలా మందిపై పడుతోంది. ఇవన్నీ సగటు మనిషిని ఒత్తిడికి గురిచేసి తద్వారా నిద్రను దూరం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త తిని సేదదీరదామనుకునే ఎంతో మందికి నిద్ర సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది.
కంటి నిండా నిద్ర
ఉరుకుల, పరుగుల జీవితం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంత వరకు వివిధ రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని గడుపుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఒకవైపు ఉద్యోగ జీవితంలో ఉన్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. మరోవైపు కుటుంబాన్ని సాఫీగా నడిపించాల్సిన బాధ్యత చాలా మందిపై పడుతోంది. ఇవన్నీ సగటు మనిషిని ఒత్తిడికి గురిచేసి తద్వారా నిద్రను దూరం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త తిని సేదదీరదామనుకునే ఎంతో మందికి నిద్ర సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. గంటల తరబడి మంచంపై సమయాన్ని వెచ్చించిన నిద్ర రాక ఎంతో మంది బాధ పడుతుంటారు. కంటి నిండా నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు చేస్తుంటాయి. ఈ నేపథ్యలో కంటి నిండా కునుకు పట్టాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారి ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కంటి నిద్రకు ఉపకరించే ఆహార పదార్థాలు ఇవే
కంటి నిండా నిద్ర పట్టాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా వాల్ నట్స్ తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం నిద్రకు ఉపకరిస్తుంది. బాదంలోని మెగ్నీషియం, కాల్షియం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేయడంతోపాటు నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రోజుకు ఒక అరటి పండు తీసుకోవడం ద్వారా మంచి నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులోని పొటాషియం, మెగ్నీషియం కూడా నిద్రకు దోహదం చేస్తుంది. చెర్రీలు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. దీనిలోని మెలటోనిన్ హాయినైనా నిద్రకు మేలు చేస్తుంది. చేపలు తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. ఇందులోని ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ నిద్రకు ఉపకరిస్తుంది. ఓట్ మిల్, చిలకడదుంపల్లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కూడా మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. హెర్బల్ టీలు ముఖ్యంగా చమోలి టీ, లావెండరీ టీలు నిద్రను ప్రేరేపిస్తాయి. గోరువెచ్చని పాలు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు మెరుగైన నిద్రను అందిస్తాయి. నిద్రపోయే ముందు కాఫీ, టీ, చాక్లెట్స్ తీసుకోకూడదు. స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే వాటికి దూరంగా ఉంటే మరీ మంచిది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మీట్ తినకపోవడమే చాలా మంచిది. మద్యానికి దూరంగా ఉండటం అత్యవసరం. ఆకుకూరలు, నట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, చేపలు, అరటి పండ్లు, బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, అవిసె గింజలు నిద్రను ప్రేరేపించే పోషకాలను అందిస్తాయి. స్క్రీన్ కు వీలైనంత దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మంచి నిద్రను పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను నిత్యం పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతోపాటు కంటినిండా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.