గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్ లు ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలు లేని వారు ఈ తరహా చెల్లింపులు చేసేందుకు అవకాశం లేదు. అయితే ఇకపై బ్యాంకు ఖాతా లేకపోయినా యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశాన్ని ఆర్బిఐ కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం డెలిగేటెడ్ పేమెంట్స్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) ప్రకటించింది.
యూపీఐ చెల్లింపులు
గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్ లు ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలు లేని వారు ఈ తరహా చెల్లింపులు చేసేందుకు అవకాశం లేదు. అయితే ఇకపై బ్యాంకు ఖాతా లేకపోయినా యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశాన్ని ఆర్బిఐ కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం డెలిగేటెడ్ పేమెంట్స్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బిఐ ఈ మేరకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక యూపీఐ వినియోగదారుడు తన బ్యాంకు అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమిత వరకు యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారం ఇచ్చే వీలుంటుంది. బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలు ద్వారా యూపిఐ చెల్లింపులు జరిపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడనిందని థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ కివి సహ వ్యవస్థాపకులు మోహిత బేడీ అన్నారు. ఈ వెసులుబాటుకు సంబంధించి పూర్తి విధి విధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే మరింతగా డిజిటల్ పేమెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇకపై యూపీఐ పరిమితి ఐదు లక్షల పెంపు..
యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి ప్రస్తుతం లక్షగా ఉండగా దాన్ని ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నులు సైతం యూపీఐ ద్వారా సులువుగా, వేగంగా చెల్లించేందుకు వీలవుతుందని పేర్కొంది. చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుతం చెక్కు క్లియరెన్స్ కు రెండు రోజుల వరకు సమయం పడుతోంది. ఇకపై బ్యాచ్ ప్రాసెసింగ్ కు బదులు ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్ విధానంలో చెక్కులను క్లియర్ చేస్తారు. అంటే చెక్కు వచ్చిన కొన్ని గంటల సమయంలోనే అది క్లియర్ కానుంది. అదే సమయంలో అనధికారిక, మోసపూరిత రుణ యాప్ లకు చెక్ పెట్టేందుకు తమ నియంత్రణలోని సంస్థలను నిర్వహిస్తున్న డిజిటల్ ఋణ యాప్లతో ఒక రిపాజిటరిని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదన చేసింది. అనధికారిక, దారుణ యాప్ లను గుర్తించడంతోపాటు కస్టమర్లు వాటి వలలో పడకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది.