ఇకపై బెనిఫిట్ షోలకు నో పర్మిషన్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలు విడుదలైన ప్రతి సమయంలోను ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గతంలో ఇచ్చినట్టుగా ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు.

Allu Arjun, CM Revanth Reddy

అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలు విడుదలైన ప్రతి సమయంలోను ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గతంలో ఇచ్చినట్టుగా ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం మాట్లాడిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇటువంటి షోలు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏ నిర్ణయం పట్ల సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద హీరోలు సినిమాలు విడుదలైనప్పుడు బెనిఫిట్ షోలు ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బెనిఫిట్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు పెద్ద ఎత్తున ఆదరణ కూడా అభిమానుల నుంచి లభిస్తుంది. అయితే బెనిఫిట్ షోస్ వల్ల అభిమానులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కొన్నిసార్లు ప్రాణాలను కూడా కోల్పోతున్న పరిస్థితులు చూస్తున్నామని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా విడుదలైన సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చారని, ఆయన చూసేందుకు అభిమానులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురుకాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు చెబుతున్నారు. 

పరామర్శలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. తొక్కిసలాట అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా హీరోలను అరెస్టు చేస్తే అందరూ రాద్ధాంతం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం పేర్కొన్నారు. సినిమా హీరో వచ్చేందుకు సంధ్యా థియేటర్ కి అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. రెండో తేదీన సంధ్యా థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసిందని, మూడో తేదీన లిఖితపూర్వకంగా పోలీసులు అనుమతి నిరాకరించారని సీఎం వెల్లడించారు. అనుమతి లేకుండా నాలుగో తేదీన అల్లు అర్జున్ సహా హీరోయిన్ అక్కడికి వచ్చారని, ఒకటే దారి ఉందని పేర్కొన్నారు. హీరో, హీరోయిన్ రావద్దని చెప్పిన వచ్చారని, వచ్చినప్పటికీ హీరో కారులో వచ్చి సినిమా చూసి సైలెంట్ గా వెళ్ళిపోతే సరిపోలేదని, రోడ్ షో చేసుకుంటూ రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక తల్లి చనిపోయిందని, మరో బిడ్డ చావు బతుకుల మధ్య ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జైలులో ఉంటే సినిమా నటులంతా వెళ్లి పరామర్శిస్తున్నారని, ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ విడ్డూరం అంటూ వ్యంగ్యస్త్రాలను సందించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్