నవ్వుతోనే ఇకపై డబ్బు చెల్లింపు.. స్మైల్ పే పేరిట ముఖ గుర్తింపు చెల్లింపు వ్యవస్థ

ఫోన్ నెంబర్ ద్వారా డబ్బులు చెల్లించడం, స్కానర్ ద్వారా చెల్లింపులు చేయడం ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. అయితే, చిన్నపాటి చిరు నవ్వు ద్వారా డబ్బులు చెల్లించే సరికొత్త విధానం అందుబాటులోకి రాబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగదు నుంచి కార్డులు తర్వాత క్యూఆర్ కోడ్లు, వేరియబుల్స్ తో వివిధ రకాల చెల్లింపులు చేస్తున్నాం. తాజాగా ముఖ గుర్తింపు టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు జరిపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Smile Pay

 స్మైల్ పే 

ఫోన్ నెంబర్ ద్వారా డబ్బులు చెల్లించడం, స్కానర్ ద్వారా చెల్లింపులు చేయడం ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. అయితే, చిన్నపాటి చిరు నవ్వు ద్వారా డబ్బులు చెల్లించే సరికొత్త విధానం అందుబాటులోకి రాబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగదు నుంచి కార్డులు తర్వాత క్యూఆర్ కోడ్లు, వేరియబుల్స్ తో వివిధ రకాల చెల్లింపులు చేస్తున్నాం. తాజాగా ముఖ గుర్తింపు టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు జరిపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఫెడరల్ బ్యాంకు స్మైల్ పే పేరుతో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారత చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ తరహా చెల్లింపు విధానాన్ని ప్రారంభించడం దేశంలోనే మొదటిది. రిలయన్స్ రిటైల్, స్వతంత్ర మైక్రో హౌసింగ్ సహకారంతో ఎంపిక చేసిన శాఖలు అవుట్ లెట్లలో పైలెట్ గా దీన్ని ప్రారంభించింది. యుఐడిఏఐకి చెందిన బీమ్ ఆధార్ పేపై ఆత్యాధునిక ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఈ వినూత్న సదుపాయం వల్ల నగదు, కార్డులు, మొబైల్ డివైస్ లు అవసరం లేకుండా ఒక్క నవ్వుతో చెల్లింపులు చేయవచ్చు.

తొలుత స్మైల్ సర్వీసు కేవలం ఫెడరల్ బ్యాంకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వ్యాపారులు, కస్టమర్లు ఇద్దరూ కూడా ఫెడరల్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలి. రానున్న కాలంలో ఈ సేవలను విస్తృతం చేయనున్నారు. స్మైల్ పే ద్వారా ఒక్కో లావాదేవీకి రూ.5000 వరకు పరిమితి ఉంటుంది. నెలకు రూ.50 వేల వరకు చెల్లింపులు చేయవచ్చు. బ్యాంకు మర్చంట్స్ తమ మొబైల్ లో ఫెడ్ మర్చంట్ అప్లికేషన్ లో పేమెంట్ ఆప్షన్ లో ఉండే స్మైల్ పే ఆప్షన్ ఎంచుకొని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఫెడ్ మర్చంట్.. కస్టమర్ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. అనంతరం వ్యాపారి మొబైల్ నుంచి కస్టమర్ ముఖాన్ని స్కాన్ చేస్తారు. వ్యవస్థలో నిల్వ ఉన్న ఫేషియల్ డేటా ఆధారంగా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తరువాత కస్టమర్ ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అవుతుంది. ఆ మొత్తం వ్యాపారి ఫెడరల్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ తరహా సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో దసలవారీగా వివిధ నగరాలకు ఈ సేవలను విస్తరించే దిశగా ఈ సంస్థ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన చోట్ల విజయవంతం అయితే మిగిలిన చోట్లకు ఈ సేవలను విస్తరించనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్