కేజీబీవీల్లో ఇకపై ఇంటర్ విద్య.. కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్న ప్రభుత్వం

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంటుంది. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు సరవేగంగా ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో వేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పేదరికం వల్ల బడికి దూరమైన వాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు ఉచిత విద్య కోసం ఏర్పాటుచేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీల్లో) ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొదట 2005లో కేజీబీవీలు ఏర్పాటుచేసిన తొలినాలలో ఆదరణ తక్కువగా ఉండేది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంటుంది. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు సరవేగంగా ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో వేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పేదరికం వల్ల బడికి దూరమైన వాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు ఉచిత విద్య కోసం ఏర్పాటుచేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీల్లో) ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొదట 2005లో కేజీబీవీలు ఏర్పాటుచేసిన తొలినాలలో ఆదరణ తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ప్రవేశాలకు తీవ్రమైన పోటీ నెలకొంది. 6 నుంచి 10వ తరగతి వరకు మొదట్లో బోధించేవాళ్లు. 2018లో కేజీబీవీలో ఇంటర్ విద్య ప్రవేశపెట్టారు. కేవలం స్కూల్ విద్యకు మాత్రమే పరిమితమైన కేజీబీవీలో ఇకపై ఇంటర్ విద్య కూడా ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. ఒక కోర్సు కు ప్రథమ సంవత్సరంలో 40, ద్వితీయ సంవత్సరంలో 40 మంది బాలికలకు ప్రవేశాలను కల్పించనున్నారు. కేజీబీవీ లో చేరే విద్యార్థులకు చదువుతోపాటు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇంటర్ పూర్తికాగానే విద్యార్థులు ఈఏపీ సెట్, నీటి పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తూ శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. వృత్తి విద్యా కోర్సులతోపాటు కుట్లు, అల్లికలు, కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాలను సులభంగా ఎదుర్కొనేలా వారిని పలు కార్యక్రమాల ద్వారా తీర్చిదిద్దుతున్నారు. 

కేజీబీవీ లో ఇంటర్ విద్యను ప్రవేశ పెడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులకు మేలు చేకూరుతుంది. కేజీబీవీ లో పదో తరగతి పూర్తయిన తర్వాత ఎంతోమంది ఇంటర్మీడియట్ చదవలేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అటువంటి వారంతా ఇప్పుడు కేజీబీవీలో ఇంటర్ విద్య ప్రవేశ పెడుతుండడంతో ఉన్నత విద్య చదివేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ఉన్నత విద్య చదవాలి అన్న కోరిక ఉన్న నిరుపేద విద్యార్థినులకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇంటర్లో అద్భుతమైన మార్పులతో సత్తా చాటిన విద్యార్థులు భవిష్యత్తులోనూ మంచి అవకాశాలను పొందేందుకు మార్గం సుగమం చేసినట్టు అవుతుందని పలువురో పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేజీబీవీలో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇంటర్ విద్యతోపాటు ఆ తరువాత ఉన్నత చదువులు చదివేందుకు అనుకూలమైన శిక్షణను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్