సూటు, బూటుతో టిప్ టాప్ గా వచ్చే వారికి మాత్రమే మాల్స్ లోకి ప్రవేశం అన్నట్టుగా బెంగుళూరులోని ఒక మాల్ నిర్వాహకులు వ్యవహరించారు. పంచ కట్టుతో వచ్చిన ఒక రైతును మాల్ లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. బెంగళూరు నగరంలోని జిటి వరల్డ్ మాల్ లో సినిమా చూసేందుకు వచ్చిన రైతును అక్కడ సిబ్బంది దారుణంగా అవమానించారు. పంచె కట్టుతో వచ్చాడని ఆ రైతును సిబ్బంది లోపలకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు.
చెన్నై జిటి వరల్డ్ మాల్ వద్ద రైతు, కుమారుడు
సూటు, బూటుతో టిప్ టాప్ గా వచ్చే వారికి మాత్రమే మాల్స్ లోకి ప్రవేశం అన్నట్టుగా బెంగుళూరులోని ఒక మాల్ నిర్వాహకులు వ్యవహరించారు. పంచ కట్టుతో వచ్చిన ఒక రైతును మాల్ లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. బెంగళూరు నగరంలోని జిటి వరల్డ్ మాల్ లో సినిమా చూసేందుకు వచ్చిన రైతును అక్కడ సిబ్బంది దారుణంగా అవమానించారు. పంచె కట్టుతో వచ్చాడని ఆ రైతును సిబ్బంది లోపలకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. అదే సమయంలో అన్ని వర్గాల నుంచి జీటి మాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం మాగడి రోడ్డులోని జిటి మాల్ సినిమాకు వెళ్లారు. పంచె కట్టుతో ఉన్న నాగరాజు తండ్రిని చూసి ప్రవేశద్వారం వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. నాగరాజు జిటి మాల్ సిబ్బందితో అర గంటకుపైగా వాదించిన అంగీకరించలేదు. జిటి మాల్ లో నిబంధనలు అలా ఉన్నాయని తేల్చి చెప్పారు. వివాదం జరుగుతున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అవి వైరల్ గా మారడంతో సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మాల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ వివాదం నేపథ్యంలో రైతు సంఘాలు, కన్నడ సంఘాల సభ్యులు బుధవారం పంచె కట్టుతో వెళ్లి జిటి మాల్ ముందు నిరసన తెలిపారు. తామంతా పంచెలతోనే వచ్చామని, మాల్ లోకి ఎందుకు అనుమతించరో చూస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది రైతులకు జరిగిన అవమానమని, వెంటనే మాల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. దీనిపై జిటి మాల్ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. దేశ వ్యాప్తంగా 60 శాతానికి పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా పంచె కట్టులోనే జీవనాన్ని సాగిస్తుంటారు. అటువంటి వారి పట్ల ఈ తరహా వివక్షపూరితంగా వ్యవహరించడం దారుణమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. రైతులను బీటీ మాల్ అవమానించిందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సర్వత్ర జీటీ మాల్ పై ఆగ్రహం వ్యక్తం కావడంతో చివరకు క్షమాపణను యాజమాన్యం చెప్పింది. అదే సమయంలో ఆ రైతును అడ్డుకున్న సిబ్బందిపైన కూడా వేటు వేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం సద్దుమణుగుతోంది.