Liquor Effects | మద్యం కొంచెం తాగినా క్యాన్సర్ ముప్పు: డబ్ల్యూహెచ్‌వో

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||ప్రతీకాత్మక చిత్రం|| మద్యం ఏ మోతాదు లో సేవించిన ఆరోగ్యానికి క్యాన్సర్ సంబంధిత  అపాయం తప్పదంటున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ.  ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వహించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మంది మద్యం సేవించడం వల్ల మరణిస్తున్నారు. తాజాగా ఐరోపాలో 20 కోట్ల మంది మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచివుందని వెల్లడించింది. గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రమాదాలు, ఆత్మహత్యలు ఈ మరణాలకు దోహదం చేస్తాయని వెల్లడించింది. మద్యం సేవించడం వల్ల జీవితకాలం కూడా పెరుగుతుందని,  తక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు కానీ, ఇది ఏ మాత్రం నిజం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

మద్యం తక్కువ మోతాదులో అయిన సేవించిన సరే ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని క్యాన్సర్ కు దారి తీస్తుందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ లో  ప్రచురిస్తూ వివరించింది. ఐరోపాలో 2017 లో నిర్వహించిన నివేదిక ప్రకారం తక్కువ మోతాదులో మద్యం సేవించిన 23 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 50 శాతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఎప్పుడూ 20కోట్ల మందిలో ఏడు రకాలకు పైగా క్యాన్సర్ వల్ల ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మద్యపానం సేవించే వారిలో కాలేయ సమస్యలు, కొవ్వు చేరడం, హెపటైటిస్, సిర్రోసిస్, కామెర్లు, పొత్తికడుపు నొప్పి, శరీరంలోని వివిధ భాగాలలో వాపు, గైనెకోమాస్టియా, క్యాన్సర్ వల్ల ముప్పు పొంచివుందని ఐరోపా ప్రాంతీయ విభాగ సభ్యుడు జూర్గన్ రెహం వెల్లడించారు. అలాగే  తక్కువ నాణ్యత కలిగిన మద్యం సేవించే పేద, వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువ ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మద్యపానం గుండెకు మేలు చేస్తుందా... మనశ్శాంతినిస్తుందా...  కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుందా.. జీవితకాలంని పెంచుతుందా.. అలాంటప్పుడు గుండె రక్షణ కోసం మద్యపానాన్ని ప్రోత్సహించాలా అనే వాటికి సమాధానం లేదు. తక్కువ మోతాదు అయిన మద్యపానం క్యాన్సర్ కు కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్