నిజామాబాద్, ఈవార్తలు: బీడీ టేకేదారులకు బీడీ కంపెనీల యాజమాన్యాల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం పెరిగిన జీవన వ్యయాల దృష్ట్యా బీడీ టేకేదారులకు రూ.4.50 కమీషన్ పెంచుతూ బీడీ కంపెనీల యాజమాన్యాల అధ్యక్షుడు జిత్రేంద ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిజామాబాద్‌లోని హోటల్ నిఖిల్ సాయిలో బీడీ టేకేదారుల సంక్షేమ సంఘంతో జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం టేకేదారులకు రూ.18.10 ఇస్తుండగా, ఇక నుంచి కమీషన్ రూ.22.60 అందనుంది. దీనిపై బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది టేకేదారులకు న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్, బీడీ టేకేదారుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల నారాయణ, ప్రధాన కార్యదర్శి తీగల వెంకన్న, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు క్యాస మల్లారెడ్డి, బొమ్మకంటి గంగాధర్, చిలకమర్రి శ్రీనివాస్, కముటం మల్లయ్య, మిట్టపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్