ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు ఇప్పటికీ అనేక దారుణాలకు కారణమవుతున్నాయి. ప్రజల అపనమ్మకాలు కొన్నిసార్లు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా అటువంటి ఘటనే చతిష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా హత్య చేశారు. చతిష్ ఘడ్ రాష్ట్రంలో నాలుగు రోజుల వ్యవధిలో ఈ రెండు దారుణాలు చోటు చేసుకోవడం గమనార్హం.
హత్య
ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు ఇప్పటికీ అనేక దారుణాలకు కారణమవుతున్నాయి. ప్రజల అపనమ్మకాలు కొన్నిసార్లు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా అటువంటి ఘటనే చతిష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా హత్య చేశారు. చతిష్ ఘడ్ రాష్ట్రంలో నాలుగు రోజుల వ్యవధిలో ఈ రెండు దారుణాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం సుక్మా జిల్లా ఇట్కల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై స్థానికులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మౌసం కన్నా (60), బుజ్జా (34), అర్జో (34), బీరి, కర్క లచ్చి (43) గా పోలీసులు గుర్తించారు. మౌసం కన్నా కుటుంబం నిర్వహిస్తున్న క్షుద్ర పూజల కారణంగా పలువురు గ్రామంలోని చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఈ దాడికి ఒడిగట్టినట్టు జిల్లా ఎస్పీ కిరణ్ జి చవాన్ తెలిపారు. అంతకుముందు ఈ నెల 12న చార్ చెడ్ గ్రామంలోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొరుగింటి వారే చంపేశారు. మృతుల్లో 11 నెలల మగ శిశువు కూడా ఉన్నాడు. మృతులను చైత్రం కైవర్షియా (47), యశోద (30), జమున (28), యశ్ (11 నెలలు) గా పోలీసులు గుర్తించారు.
చైత్రం కైవర్షియా తల్లి చేస్తున్న క్షుద్ర పూజల కారణంగా తమ కూతురి ఆరోగ్యం దెబ్బతిందని ఆరోపిస్తూ పోరిగిట్లో ఉండే రామ్నాథ్ పాట్లే కుటుంబం ఈ దాడికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులు వ్యవధిలో క్షుద్ర పూజల అనుమానంతో 9 మంది హత్యకు గురి కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయా గ్రామాల్లో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలకు చేతబడి కారణమా? ఇతర అంశాలు ఏవైనా ఉన్నాయా అన్నదాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్యలు జరిగిన గ్రామాల్లోని స్థానిక ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు ఈ తరహా ఘటనలు సర్వత్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రెండు కుటుంబాలను చేతబడి పేరు చెప్పి పూర్తిగా మట్టిలో కలిపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా స్థానికులు హత్య చేయడం పట్ల సర్వత్ర విస్మయం కలుగుతుంది. ఈ తరహా ఘటనలకు చెప్పాలి అంటే పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని పరువురు చెబుతున్నారు.