మార్కెట్‌లోకి లావా కంపెనీ సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఫీచర్ ఫోన్ విభాగంలో దీన్ని గేమ్ చేంజర్‌గా ఈ కంపెనీ చెబుతోంది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ కొత్త డైరక్ట్ టూ మొబైల్ ఫీచర్ ఫోన్లను ప్రకటించింది. టైజాస్, ఫ్రీ స్ర్టీమ్ టెక్నాలజీలతో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు మొబైల్ మార్కెట్‌లోకి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. ఈ ఫోన్లలో ఉపయోగించిన డైరక్ట్ టూ మొబైల్ టెక్నాలజీని మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025(wWAVES)లో ప్రదర్శించనున్నారు.
లావా కంపెనీ సరికొత్త ఫోన్
మార్కెట్‌లోకి లావా కంపెనీ సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఫీచర్ ఫోన్ విభాగంలో దీన్ని గేమ్ చేంజర్‌గా ఈ కంపెనీ చెబుతోంది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ కొత్త డైరక్ట్ టూ మొబైల్ ఫీచర్ ఫోన్లను ప్రకటించింది. టైజాస్, ఫ్రీ స్ర్టీమ్ టెక్నాలజీలతో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు మొబైల్ మార్కెట్‌లోకి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. ఈ ఫోన్లలో ఉపయోగించిన డైరక్ట్ టూ మొబైల్ టెక్నాలజీని మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025(wWAVES)లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఫోన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన మేకిన్ ఇండియా పథకానికి అనుగుణంగా తయారు చేశారు. ఈ డివైస్‌లు ఆధారిత ప్రసార తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, ఓటీటీ వీడియోలు, ఆడియో, టెక్ట్స్ మెసేజ్‌లను అందించగలవు. ప్రజా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమాచారాన్ని సరఫరా చేయడమే వీటి లక్ష్యంగా సంస్థ ప్రకటించింది.
ఈ లావా ఫోన్‌లోని ముఖ్యమైన స్పెషిఫికేషన్స్‌ను చూస్తే.. 2.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, టీవీ ప్రసారాల స్వీకరణకు UHF యాంటెనా, వాయిస్ కాల్స్‌కు GSM సపోర్ట్, 2200 mAh బ్యాటరీ, మీడియో టెక్ MT6262 ప్లాట్ ఫారమ్‌పై నిర్మితమైన ఫోన్, సాంక్‌యో ల్యాబ్స్‌కు చెందిన SL3000 సాఫ్ట్‌వేర్ రిసీవర్ చిప్‌తో కూడిన ట్యూనింగ్, సాంక్‌యా ల్యాబ్స్ ఎస్‌డీకేతో కలిసి పనిచేసే సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్లు గ్రామీణ, తక్కువ ఆదాయ ప్రజలకు సమాచారంతోపాటు వినోదాన్ని కూడా అందించాలన్న ఉద్ధేశంతో రూపొందించబడ్డాయి. ఎమర్జెన్సీ, అలర్ట్స్, ప్రభుత్వ సమాచారం, పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్‌ను వేగంగా, విస్వసనీయంగా అందించగలవు. ఇప్పటికే A1 జోష్ BOL, A5 2025 (UPI పేమెంట్స్‌తో), ACTION 4G యూట్యూబ్ సపోర్ట్‌తో), A3 టార్చ్ వంటి లావా ఫీచర్ ఫోన్లు మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఫోన్లలో BOL (BOL), క్లౌడ్ సర్వీస్‌లు, యూజర్ సహకార ఫీచర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ వికసిత్ భారత్‌కు మద్ధతుగా పని చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. D2M ఫీచర్ ఫోన్ ధర, లభ్యతపై వివరాలు ఇంకా వెల్లడించలేదు. వీటిని WAVES 2025 కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కొత్త టెక్నాలజీతో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో లావా పెద్ద మైలురాయిగా నిలుస్తోంది. ఇంటర్నెట్ అవసరం లేకఉండా డిజిటల్ కంటెంట్‌ను అందించగల ఫోన్లు గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తాయని కంపెనీ పేర్కొంది.