తెలంగాణ బిజెపికి కొత్త బాస్.. రేసులో పలువురు నాయకుల పేర్లు.!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతుంది. ఉపాధ్యక్షుడి ఎంపికను కొద్దిరోజుల్లోనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో అద్భుత ఫలితాలను సాధిస్తూ బిజెపి నాయకులు మంచి ఊపు మీద ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ బిజెపికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశాభావంతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయినప్పటికీ పార్లమెంట్లు ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది. సరదాగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకొని తమ రాజకీయాన్ని బలాన్ని మరింతగా పెంచుకుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ బిజెపి అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతుంది. ఉపాధ్యక్షుడి ఎంపికను కొద్దిరోజుల్లోనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో అద్భుత ఫలితాలను సాధిస్తూ బిజెపి నాయకులు మంచి ఊపు మీద ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ బిజెపికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశాభావంతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయినప్పటికీ పార్లమెంట్లు ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది. సరదాగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకొని తమ రాజకీయాన్ని బలాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నియామకాను కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే రాజకీయంగా యాక్టివ్ గా ఉండే నాయకుడిని ఎంపిక చేసేందుకు బిజెపి అగ్రనాయకత్వం దృష్టిసారిస్తోంది. బలమైన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా బరిలోకి దించడం ద్వారా పార్టీని మరింత వేగంగా జనాల్లోకి తీసుకువెళతారన్న భావనను ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే సరైన నేత కోసం పార్టీ వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగాను కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలను అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వివిధ కారణాలవల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం దగ్గర పడిందని కొద్ది రోజుల్లోనే దీనిపై ప్రకటన రావచ్చని చర్చ బిజెపి వర్గాల్లో జరుగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాదు నుంచి హుటా హుటిన ఢిల్లీకి కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి చేరుకున్నారు. ఆయన ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల్లోనే బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడు ప్రకటన ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు నాయకులు రక్తం చేస్తున్నారు. తెలంగాణ బిజెపి కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పాలు తాపాలుగా నేతల అభిప్రాయాలను బిజెపి అధిష్టానం తీసుకుంది. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బిజెపిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుడు ఎంపిక విషయంలోనూ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు అంటే అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే రాష్ట్రంలోని నేతలు అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని ఆ పార్టీ భావిస్తోంది. 

జాబితాలో పలువురు నేతల పేర్లు..

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం పలువురు నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ జాబితాలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాను అధ్యక్ష పదవి రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటెల రాజేందర్ చెబుతూ వస్తున్నారు. ఈసారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని, ఇదే సానుకూల వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కోసం అన్వేషణ కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై ఇప్పటికే బిజెపి అగ్ర నాయకులు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్