Secunderabad to Goa Train | సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ రైలు.. ప్రయాణ వేళలు ఇవీ..

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఎట్టకేలకు భారతీయ రైల్వే శాఖ సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలు సర్వీస్‌ను ప్రకటించింది.

secundrabad to goa

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, హైదరాబాద్: గోవా అంటేనే కుర్రకారుకు జోష్ వస్తుంది. అయితే, గోవా వెళ్లడం తెలుగు ప్రజలకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. బస్సులోనో, కారులోనో, విమానంలోనో వెళ్లే అవకాశం ఉన్నా.. డైరెక్ట్ రైలు సౌకర్యం లేదు. సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఎట్టకేలకు భారతీయ రైల్వే శాఖ సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలు సర్వీస్‌ను ప్రకటించింది. ఈ నెల 6న సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలును ప్రారంభిస్తారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉండనుంది.

సికింద్రాబాద్-గోవా రైలు వివరాలివీ..

రైలు నంబర్: 17039 (సికింద్రాబాద్ నుంచి)

ప్రయాణ వారాలు : బుధవారం, శుక్రవారం

సమయం: ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది

రైలు నంబర్: 17040 (వాస్కోడిగామా నుంచి)

ప్రయాణ వారాలు: గురువారం, శనివారం

సమయం: ఉదయం 9 గంటలకు వాస్కోడిగామాలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

హాల్ట్ స్టేషన్లు: కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూలు సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్‌


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్