ఎసెన్షియ ప్రమాదం వెనుక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.. ఆడిట్ రిపోర్టు పట్టని పరిశ్రమల శాఖ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియ పరిశ్రమలో ప్రమాదం సంభవించి 60 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, 17 మంది మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు సాగించిన అధికారులు కీలక అంశాలను గుర్తించారు. ఈ ప్రమాదం వెనుక అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. జీవో నెంబర్ 156 ఆధారంగా గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ కంపెనీల్లో భద్రతా తనిఖీలను చేయించింది. ఇందులో భాగంగా ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పైపులైన్లు పాతవైపోయాయని, లీకులు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కంపెనీ ప్రతినిధులకు అప్పట్లోనే నివేదిక అందించారు.

CM Chandrababu Naidu

ప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియ పరిశ్రమలో ప్రమాదం సంభవించి 60 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, 17 మంది మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు సాగించిన అధికారులు కీలక అంశాలను గుర్తించారు. ఈ ప్రమాదం వెనుక అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. జీవో నెంబర్ 156 ఆధారంగా గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ కంపెనీల్లో భద్రతా తనిఖీలను చేయించింది. ఇందులో భాగంగా ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పైపులైన్లు పాతవైపోయాయని, లీకులు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కంపెనీ ప్రతినిధులకు అప్పట్లోనే నివేదిక అందించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా వాటిని మార్చుకోవాలని, థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని భద్రత సూచనలు చేశారు. ఈ అంశాలను పరిశీలించి అమలు చేసే బాధ్యతను విశాఖకు చెందిన పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కు అప్పగించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోవడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగి 17 మంది కార్మికులు మృతికి కారణమైనట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. భద్రతను గాలికి వదిలేసిన అధికారులు కనీసం ఒక్కసారి కూడా ఎసెన్షియ ఫార్మా కంపెనీని సందర్శించలేదు. భద్రతాపరమైన లోపాలను సరిచేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించ లేదంటే ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. గతంలో విశాఖపట్నంలో సంచలనమైన ఎల్జి పాలిమర్స్ కంపెనీ దుర్ఘటనలోను ఆడిట్ రిపోర్టును పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ నివేదించింది. దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. తూతూ మంత్రంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు 

ఎసెన్షియ ఫార్మా లో ఏజీఎం స్థాయి ఉన్నతాధికారితో సహా 16 మంది మృతి చెందడానికి కారణమైంది. అదే సమయంలో ఎసెన్షియ ఫార్మాలో జరిగిన పేలుడులో కుట్ర కోణం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఈ కంపెనీలో ఇద్దరు యజమానుల మధ్య ఉన్న వివాదమే కారణంగా చెబుతున్నారు. ఈ కంపెనీలో 74% వాటా డెక్కన్ కెమికల్స్ కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. డెక్కన్ కెమికల్స్, ఎసెన్షియ ఫార్మ వ్యవస్థాపకులు మధ్య యాజమాన్యంపై వివాదం నెలకొంది. దీనిపై న్యాయస్థానాల్లోనూ వ్యాజ్యం నడుస్తోంది. ఈ వివాదం కారణంగానే భారీ విస్పోటం జరిగి 17 మంది మృతి చెందడానికి కారణమైందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో ప్రకటించడం గమనార్హం. కుట్ర కోణంపైన దర్యాప్తు చేస్తామని సీఎం ప్రకటించడం ప్రస్తుతం సర్వత్ర అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఇదిలా ఉంటే ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధ్యత కుటుంబాలకు ఆయన భరోసాను కల్పించారు. మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. అలాగే బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలించిన ఆయన ప్రమాదం జరిగిన తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ తరహా ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రమాదమే చివరిది కావాలి అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. నేరుగా అనకాపల్లి వెళ్లి అక్కడ బాధితు కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్