నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా.. ఎన్టిఏ నిర్ణయం

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీటి యుజి-2024 పరీక్షల్లో అక్రమాలు వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వివాదంపై కొద్దిరోజుల నుంచి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలోని అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై వాదోపవాదనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వా నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్ లీక్ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బిజెపి పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

NEET UG-2024

నీట్ యుజి-2024


వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి-2024 పరీక్షల్లో అక్రమాలు వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వివాదంపై కొద్దిరోజుల నుంచి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలోని అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై వాదోపవాదనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వా నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్ లీక్ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బిజెపి పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం వివాదం కాకపోయినట్టైతే శనివారం నుంచి యూజీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే దేశ వ్యాప్తంగా దీనిపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేసింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్టిఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టిఏ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మే ఐదో తేదీన నీట్ యూజీ-2024 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతోపాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైన పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నీట్  అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేయడం కూడా ఆందోళనకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ఉద్దేశంతోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ప్రవేశాలకు సంబంధించి తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్నది సర్వత్ర ఆసక్తి నెలకొంది. కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం విద్యాశాఖ త్వరలో ప్రకటిస్తుందా..? లేక..? దీనిపై మరేదైనా నిర్ణయం వెలువడుతుందా..? అన్న చర్చ జరుగుతోంది. కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం విద్యాశాఖ త్వరలో ప్రకటిస్తుందా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్