దేశ ద్రోహుల భరతం పట్టేలా యోగి సర్కారు కీలక నిర్ణయం

దేశద్రోహుల భరతం పట్టేలా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించే పాలసీని తీసుకొచ్చింది.

YOGI ADITHYANATH

యోగి ఆదిత్యనాథ్

లక్నో : దేశద్రోహుల భరతం పట్టేలా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించే పాలసీని తీసుకొచ్చింది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జీవితాంతం జైల్లో ఉంచేలా తెస్తున్న పాలసీకి ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్టులకు ఈ రూల్ వర్తించనుంది. దేశ వ్యతిరేక పోస్టులను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. దేశ వ్యతిరేక కంటెంట్ పెట్టడం తీవ్ర నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే తక్కువలో తక్కువ 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. గరిష్ఠంగా జీవిత ఖైదు, భారీగా జరిమానా విధిస్తారు.

మరోవైపు, సోషల్ మీడియాలో అశ్లీలత, పరువు నష్టం కలిగించే కంటెంట్ ఎక్కువగా పెరుగుతున్నందున.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టేలా కొత్త పాలసీలో తీసుకొచ్చింది. దీనికోసం వీ-ఫోరం అనే డిజిటల్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి.. సోషల్ మీడియా కంటెంట్‌పై నిఘా ఉంచనుంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలు, కంటెంట్లు, పోస్టులు, ట్వీట్లు, రీల్స్ అన్నీ వీ-ఫోరం నిఘాలో ఉంటాయి.

ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, సర్కారు సాధించిన విజయాల కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు సంపాదించవచ్చని యోగి సర్కారు ఆఫర్ ఇస్తోంది. ఈ పాలసీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే.. రూ.5 లక్షల వరకు, యూట్యూబ్‌లో అయితే రూ.8 లక్షల వరకు సంపాదించుకొనే వీలుందని వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్