చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. మూడు రోజుల కిందట vivo v40e పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్న ఈ మొబైల్ కెమెరా ఫీచర్లను కూడా వివో కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 98 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ అందిస్తుందని పేర్కొంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్ వివో వీ40 ప్రో మొబైల్ డిజైన్ మాదిరిగానే ఉంది.
vivo v40e స్మార్ట్ ఫోన్
దసరా, దీపావళి పండుగ వస్తుండడంతో వివిధ స్మార్ట్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు తమ కొత్త బ్రాండ్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ రెండు పండగల సందర్భంగా ఇండియాలో పెద్ద ఎత్తున కొత్త ఫోన్లు కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇండియన్ మార్కెట్ కు అనుగుణంగా కొత్త ఫీచర్స్ తో వివో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. కళ్ళు చెదిరే ఫీచర్లతో వివో నుంచి వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పలు సంస్థలు ఇప్పటికే భారీ ఆఫర్లను ఈ ఫోన్ పై ప్రకటించాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. మూడు రోజుల కిందట vivo v40e పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్న ఈ మొబైల్ కెమెరా ఫీచర్లను కూడా వివో కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 98 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ అందిస్తుందని పేర్కొంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్ వివో వీ40 ప్రో మొబైల్ డిజైన్ మాదిరిగానే ఉంది.
ఆకట్టుకుంటున్న వివో ఫోన్ ఫీచర్లు..
vivo v40e స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లను పరిశీలిస్తే.. డిస్ప్ ప్లే 6.77 అంగుళాల 3d కర్వ్డ్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz కాగా, 0.749 సెంటీమీటర్లు మందంతో డిజైన్ చేశారు. ఈ ఫోన్ 183 గ్రాముల బరువుతో స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సల్ కాగా, ఆల్ట్రా వైడ్ కెమెరా 8 మెగా పిక్సల్. ఫ్రంట్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఐ ఏఎఫ్ కెమెరా. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కాగా, 2ఎక్స్ పోర్ట్రైట్ మోడ్ తో డిజైన్ చేశారు. వీటితో పాటు 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ, ప్రాసెసర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ గా ఉంది. పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ కాగా, బ్యాటరీ 5,500 ఎంఏహెచ్, 8w ఫ్లాష్ ఛార్జ్, వెబ్ టచ్ ఫీచర్, ఏఐ అరేజర్, ఏఐ ఫోటో ఎన్ హాన్సర్, IP64 రేటింగ్, బ్లూటూత్ 5.4, యూఎస్బి టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో మార్కెట్లో అందుబాటులో ఉంది. రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక ధర విషయానికి వస్తే.. 8GB + 128 GB వేరియంట్ ధర రూ.28,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.30,999. అక్టోబర్ రెండు నుంచి ఈ మోడల్ మొబైల్స్ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నట్లు వివో సంస్థ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్, వివో ఈ స్టోర్ తోపాటు వివో ప్రధాన స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పించింది. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బిఐ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందువచ్చని సంస్థ వెల్లడించింది.