కేంద్ర ప్రభుత్వం మరికొద్ది క్షణాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై పేద, మధ్యతరగతి ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమకు మేలు చేసే నిర్ణయాలను ప్రకటిస్తుంది అన్న ఆశతో చూస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళల కోసం ఎటువంటి పథకాలను ప్రవేశపెడతారు అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యతను ఇస్తుంది అన్నదానిపై స్పష్టత రావాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
బడ్జెట్ తయారుచేసిన బృందంతో మంత్రి నిర్మల
కేంద్ర ప్రభుత్వం మరికొద్ది క్షణాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై పేద, మధ్యతరగతి ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమకు మేలు చేసే నిర్ణయాలను ప్రకటిస్తుంది అన్న ఆశతో చూస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళల కోసం ఎటువంటి పథకాలను ప్రవేశపెడతారు అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యతను ఇస్తుంది అన్నదానిపై స్పష్టత రావాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. దేశవ్యాప్తంగా సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉచిత పథకాలతో రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ఆర్థిక ఇక్కట్లను తొలగించేలా లబ్ధి చేకూరుతుందా.? భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం లభిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కొన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యతను కల్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, నిరుపేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక పథకాల అమలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఈసారి బడ్జెట్లో పలు రంగాల పనులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలలు నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో స్కీం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ ను 10 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరుతున్న వేతన జీవులకు ఈ బడ్జెట్లో కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ బడ్జెట్ పై ఏపీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలో బయ్యారం ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం, అమరావతి విషయంలో 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్ల నిధులను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో కొంత మేరకు విడుదల కూడా చేసింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేను నీతో సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు అవసరం. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. అయితే ఈ కోరికను కేంద్ర ప్రభుత్వం మన్నించిందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేటాయింపులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.