ఉరుకుల పరుగులు జీవితంలో పడ ప్రతి ఒక్కరినీ మతి మరుపు సమస్య వేధిస్తోంది. అయితే, ఈ తరహా ఇబ్బందులకు చెక్ చెప్పడంతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చే గుణం డ్రైఫ్రూట్స్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చిన్నారులు, పెద్దల్లో అద్భుతస్థాయిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్
ఉరుకుల పరుగులు జీవితంలో పడ ప్రతి ఒక్కరినీ మతి మరుపు సమస్య వేధిస్తోంది. అయితే, ఈ తరహా ఇబ్బందులకు చెక్ చెప్పడంతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చే గుణం డ్రైఫ్రూట్స్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చిన్నారులు, పెద్దల్లో అద్భుతస్థాయిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు జ్ఞాపక శక్తి మెరుగుపడేందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ గు రించి ఇందులో తెలియజేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యమైనది బాదం. ఇందులో విటమిన్ ఈ కంటెంట్ అధికంగా ఉండడ ంతోపాటు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. బాదంలోని రైబోప్లేవిన్, ఎల్ కెరోటిన్ మెదడును యాక్టివ్‌గా ఉంచుతు ంది. మరో డ్రై ఫ్రూట్ వాల్ నట్. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే, ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, డీహెచ్‌ఏలు, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును పెంచుతాయి. వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీడి పప్పులోని మెగ్నీషియం జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
జీడిపప్పు తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. మరో డ్రై ఫ్రూట్ పిస్తా. పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 ఆరోగ్యాన్ని అందిస్తాయి. పిస్తా తింటే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. హజెల్ నట్స్‌లో విటమిన్ ఈ, ఫోలేట్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును అద్భుత స్థాయిలో మెరుగుపరుస్తాయి. హజల్ నట్స్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతుంది. మరో కీలకమైన డ్రై ఫ్రూట్. పికాన్స్. పికాన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. పికాన్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుముఖం పట్టడంతోపాటు అభిజ్ఞా పనితీరు మెరుగు పడుతుంది. మరో డ్రై ఫ్రూట్ బ్రెజల్ నట్. బ్రెజల్ నట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రెజల్ నట్స్‌లోని పోషకాలు ఆ రోగ్యంగా ఉండేందుకు ఉపకరించడంతోపాటు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడంతోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయడం ఆరోగ్యంగా ఉండవచ్చు.