పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడ్డ భారత ఆర్మీ.. ఆ దాడుల ఆపరేషన్‌కు OPERATION SINDOOR అని నామకరణం చేసింది.
పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడ్డ భారత ఆర్మీ.. ఆ దాడుల ఆపరేషన్‌కు OPERATION SINDOOR అని నామకరణం చేసింది. ఆ పేరుకు అర్థం ఏంటా అని ఇప్పుడు అంతా ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ పేరుకు గొప్ప అర్థమే ఉంది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్‌లో హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రవాదులు చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎంతోమంది కొత్తగా పెళ్లయిన వారు అసువులు బాసారు. జంటల్లో పురుషులను వేరు చేసి, మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ముఖ్యంగా ఘటనకు ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను చంపేయగా.. అతడి మృతదేహం వద్ద హిమాన్షి నిశ్చేష్టురాలై ఉన్న చిత్రం దేశం మొత్తాన్ని కదిలించింది. వినయ్ నేవీ అధికారి కూడా.
అయితే, ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అని భారత ఆర్మీ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళల నుదట సింధూరాన్ని తుడిపేసిన పాక్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి.