జమ్మూలో బిజెపి అభ్యర్థుల ఎంపికపై రగడ.. 15 మందితో తొలి జాబితా విడుదల

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు విడతల్లో ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, 25 తోపాటు అక్టోబర్ ఒకటో తేదీన ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడంపై బీజేపీతోపాటు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే, ఇక్కడ సీట్ల పంపకాల వ్యవహారం బిజెపిలో రగడకు కారణం అవుతోంది.

BJP

బీజేపీ

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు విడతల్లో ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, 25 తోపాటు అక్టోబర్ ఒకటో తేదీన ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడంపై బీజేపీతోపాటు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే, ఇక్కడ సీట్ల పంపకాల వ్యవహారం బిజెపిలో రగడకు కారణం అవుతోంది. బిజెపి 44 మందితో తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆ జాబితాను బిజెపి ఉపసంహరించుకుంది. చివరకు కేవలం తొలిదశ ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల కోసం 15 మందితో ఒక జాబితాను మళ్ళీ ప్రకటించింది. బిజెపి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో ఒక కార్యకర్త మాట్లాడుతూ తమకు ఓటు హక్కు వచ్చినప్పటికీ నుంచి బిజెపితోనే ఉన్నామని, జమ్మూ నార్త్ లో ఓమి ఖజూరియా అందరికీ తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన్ను కాదని కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన శ్యామ్యూల్ శర్మకు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఖజూరియాకు టికెట్ ఇస్తేనే బిజెపిలో ఉంటామని తేల్చి చెప్పారు. ఇటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్లు పంపకం ఖరారు అయింది. మొత్తం 90 స్థానాల్లో ఎన్సిపి 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

మరో ఐదు చోట్ల ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగాలని నిర్ణయించాయి. సిపిఎంకు ఒక సీటు, పాంథర్స్ పార్టీకి ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించాయి. సీట్ల పంపకాలపై నెలకున్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ఎన్సీపీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షులు ఓమర్ అబ్దుల్లా నివాసాలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, మరో నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భరత్ సోలంకి వెళ్లి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ మంతనాలు ఫలితంగా సమస్యకు పరిష్కారం లభించింది. ఇక కేంద్ర ప్రాంత ఫలితం లడ్డాక్ లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ మేరకు లడ్డాక్ అభివృద్ధికి ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్రం హోంశాఖ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఐదు జిల్లాలతో పాలన మరింత పటిష్టమవుతుందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దీనిపై ప్రధాన మోడీ స్పందిస్తూ లడ్డాక్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగుగా అభివర్ణించారు. కొత్త జిల్లాలతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.

టీబీ రోగి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్