మహా కుంభమేళాలో సరికొత్త రికార్డులు.. 50 కోట్ల మంది పవిత్ర స్నానాలు

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు పూర్తి చేస్తున్నారు. గత నెల రెండో వారంలో ప్రారంభమైన మహా కుంభమేళ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కోట్లాదిమంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలను పూర్తి చేశారు. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు పూర్తిచేసి సరికొత్త రికార్డును సృష్టించారు. గత కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు పూర్తి చేస్తున్నారు. గత నెల రెండో వారంలో ప్రారంభమైన మహా కుంభమేళ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కోట్లాదిమంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలను పూర్తి చేశారు. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు పూర్తిచేసి సరికొత్త రికార్డును సృష్టించారు. గత కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది. అమెరికా సెన్సెస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ఎక్కడ పుణ్యస్నానాలను ఆచరించారు. యునైటెడ్ స్టేట్స్ జనాభా 34,20,34,432 మంది కాగా, ఇండోనేషియా జనాభా 28,35,87,097, పాకిస్తాన్ జనాభా 25,70,47,044, నైజీరియా జనాభా 24,27,94,751, బ్రెజిల్ జనాభా 22,13,59,387, బంగ్లాదేశ్ జనాభా 17,01,83,916, రష్యా జనాభా 14,01,34,279, మెక్సికో జనాభా 13,17,41,347 కంటే ఎక్కువమంది మహా కుంభమేళాలో స్నానాలు పూర్తి చేశారు.

ఆయా దేశాల జనాభా సంఖ్య కంటే రెట్టించిన జనాభా ఇక్కడ పుణ్యస్నానాలు పూర్తి చేయడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టించారు. మహా కుంభమేళాకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించి కుంభమేళాలో భక్తులు పాల్గొంటున్నారు. యూపీ ప్రభుత్వం మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాలు వేసింది. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 60 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌన అమావాస్య రోజు గరిష్టంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు స్నానాలను ఆచరించారు. మకర సంక్రాంతి రోజు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు పూర్తి చేశారు. వసంత పంచమి రోజు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు అధికారులు లెక్కలు వివరించారు. మాగ పూర్ణిమ రోజు కూడా రెండు కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలను ఆచరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్