నేటితో ముగియనున్న చివరి దశ ఎన్నికలు.. 57 స్థానాలకు పోలింగ్

దేశంలోని లోక్ సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఏడు దశలుగా దేశంలోని పార్లమెంటు స్థానాలకు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తికాగా.. ఏడో దశ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Voters

ఓటర్లు


దేశంలోని లోక్ సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఏడు దశలుగా దేశంలోని పార్లమెంటు స్థానాలకు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తికాగా.. ఏడో దశ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలన్నీ బిజెపికి కీలకంగా మారనున్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లోని సుమారు 10.6 కోట్ల మంది ఓటర్లు ఈ 57 పార్లమెంటు స్థానాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలు, బీహార్ లో ఎనిమిది, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది, ఒడిశాలో ఆరు, ఝార్ఖండ్ లో మూడు స్థానాలతోపాటు పంజాబ్ లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదల్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్ పూర్ నుంచి బిజెపి సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ పడుతున్నారు. ఇక బిఎస్పీ పలుచోట్ల దళితులను, ముస్లింలను అభ్యర్థులుగా నిలపడంతో.. వారు ఇండి కూటమి ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. వారణాసి నుంచి రెండుసార్లు ఎన్నికైన మోదీకి తిరుగులేనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఈసారి కాశీలో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక యూపీలోని మిగిలిన 12 స్థానాల్లో ఎన్డీఏ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై వచ్చి పంజాబ్ లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడంతోపాటు ఆసక్తిగా మారింది. ఆప్, కాంగ్రెస్ మధ్య ప్రధాని పోటీ నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్