మందుల ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రోగులకు మేలు

కేంద్ర ప్రభుత్వం పలు మెడిసిన్స్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది రోగులు వినియోగిస్తున్న కీలకమైన మందులు ధరలను కేంద్రం తగ్గించింది. షుగర్, గుండె, కాలేయం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాలు ధరలను కేంద్రం తగ్గించింది.

మెడిసిన్స్
మెడిసిన్స్





కేంద్ర ప్రభుత్వం పలు మెడిసిన్స్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది రోగులు వినియోగిస్తున్న కీలకమైన మందులు ధరలను కేంద్రం తగ్గించింది. షుగర్, గుండె, కాలేయం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాలు ధరలను కేంద్రం తగ్గించింది. ఈ జాబితాలో యాంటీసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీబయాటిక్స్ వంటి మందులు ఉన్నాయి. తగ్గిన మందులకు సంబంధించిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం భారత్. వీరికి మేలు చేసేలా తాజా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. వీటితోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా తగ్గించిన మెడిసిన్స్ ధరలు ఉపయుక్తం కానున్నట్లు చెబుతున్నారు. తగ్గించిన మందుల ధరలతో రోగులకు కనీసం 10 నుంచి 20 శాతం మేర మందుల ఖర్చు తగ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి రావాలని కేంద్రం సూచించగా, వ్యాపారులు ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్