దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ ఓట్లు.. సుప్రీం కోర్టు స్పందన ఇదే..

ఈవీఎంలు సురక్షితం కాదని, మళ్లీ పేపర్ బ్యాలెట్ వాడాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై తాజాగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.

supreme court of india
సుప్రీం కోర్టు

నేషనల్ న్యూస్, ఈవార్తలు: ఎన్నికలు అనగానే ఎప్పుడు చూసినా ఈవీఎంలపై చర్చ జరుగుతుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు.. ఈవీఎంల వల్లే గెలిచారు.. అంటూ నిత్యం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అయితే, ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం ఈవీఎంలపై క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని చెప్తూ వస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టేస్తోంది. తాజాగా మళ్లీ సుప్రీం కోర్టులో అటువంటి పిటిషనే దాఖలైంది. ఈవీఎంలు సురక్షితం కాదని, మళ్లీ పేపర్ బ్యాలెట్ వాడాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై తాజాగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. పేపర్ బ్యాలెట్‌ను తీసుకొచ్చేలా ఆదేశించలేమని స్పష్టం చేసింది. అసలు పేపర్ బ్యాలెట్ వాడాలన్న ఉద్దేశ్యమే లేదని తేల్చిచెప్పింది. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈవీఎంలలోని ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని పలు పిటిషన్లు దాఖలు కాగా, ఆ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్‌ల స్లిప్పుల వంద శాతం క్రాస్ వెరిఫికేష‌న్ కుద‌ర‌ద‌ని తెలిపింది. వీవీప్యాట్ల ఫిజిక‌ల్ డిపాజిట్ కూడా కుద‌ర‌దని పేర్కొంది.

నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక?

లోక్‌సభ ఎన్నికల వేళ వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే మళ్లీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలన్న అంశంపై సుప్రీం కోర్టు ఎన్నికల సంఘం వివరణ కోరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కాగా, 2013లో తొలిసారి ఈవీఎంలలో నోటాను చేరుస్తూ ఈసీ నిర్ణయం తీసుకొన్నది. అప్పటి నుంచి అభ్యర్థి ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసుకొనే సౌలభ్యం ఉన్నది. 

వెబ్ స్టోరీస్