దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న ఆర్పిఎఫ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చిన రైల్వే శాఖ.. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తేదీలు ఎప్పుడు ఖరారు చేస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరభద్రంలోనే పరీక్షలు షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న ఆర్పిఎఫ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చిన రైల్వే శాఖ.. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తేదీలు ఎప్పుడు ఖరారు చేస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరభద్రంలోనే పరీక్షలు షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఆర్పీఎఫ్ రాత పరీక్షలు మార్చి రెండో తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు రైల్వే శాఖ షెడ్యూల్లో పేర్కొంది. పరీక్షకు సంబంధించిన సీటీ ఇంటిమేషన్ స్లిప్పులను రాత పరీక్షకు పది రోజుల ముందు విడుదల చేయనున్నారు. ఈ స్లిప్పుల్లో పరీక్షా కేంద్రం, నగరం, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర సమాచారం ఉంటుంది. ఈ పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఈ ప్రకటనలో వెల్లడించారు.
రైల్వేశాఖ గత ఏడాది ఖాళీగా ఉన్న 4,660 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 452 ఎస్సై పోస్టులు, 4208 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పక్షులకు దేశవ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్షలు గత ఏడాది డిసెంబర్లో నిర్వహించారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నెలలు గడుస్తున్న షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలోనే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు షెడ్యూల్ను బోర్డు తాజాగా ప్రకటించింది. దీంతో అభ్యర్థుల నిరీక్షణకు తెరపడినట్లు అయింది. అహ్మదాబాద్, అజ్మీర్, v బెంగుళూరు, జమ్మూ అండ్ శ్రీనగర్, కలకత్తా, మాల్ద, ముంబై, ముజఫర్పూర్, బోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, గౌహతి, పాట్నా, ప్రయాగ్ రాజ్, సిలిగురి, తిరువనంతపురం, రాంచి, సికింద్రాబాద్, గోరఖ్పూర్ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రీజన్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి.