Ratan Tata | భారత దేశానికి రతన్ టాటా ఇచ్చిన చివరి గిఫ్ట్ ఏంటో తెలుసా..?

దేశం కోసం ఎంతో చేసిన రతన్ టాటా.. తన చివరి చర్యను కూడా భారత్ కోసమే చేశారు. టాటా గ్రూప్ ద్వారా ఎన్నో బహుమతులు దేశానికి ఇచ్చిన రతన్ టాటా.. తన చివరి గిఫ్ట్‌గా ఒక గొప్ప బహుమతినే అందించారు.

ratan tata

రతన్ టాటా

రతన్ టాటా.. నిజంగా భారతరత్నమే. టాటా గ్రూప్ ఏది చేసినా దేశం కోసం ఆలోచించి మాత్రమే చేస్తుంది. అలాంటి ఉన్నత భావాలు టాటా గ్రూప్‌నకే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని రంగాల్లో విస్తరించి.. దేశ ప్రతిష్ఠను పెంచేసిన ఘనత టాటా గ్రూప్‌ది. ఆ గ్రూప్‌నకు చైర్మన్‌గా కొనసాగిన రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనలోని ఉన్నత భావాలు ఆయన దేశ భక్తికి నిదర్శనం. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండాలన్న ఆయన సంకల్పం ముందు మహామహులు సైతం మోకరిల్లాల్సిందే. సామాన్యులకు రూ.లక్షకే కారు అందించాలన్న ఆయన ఆశయం గొప్పగా విజయం సాధించకపోయినా.. తనవంతు కృషి చేసి, సామాన్యులకు నాణ్యమైన సరుకును అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక ఇండ్లలో చాయ్ కోసం జెమినీ చాయ్ పత్తానే వాడుతున్నారంటే.. టాటా కంపెనీపై ఉన్న నమ్మకం మొదటి కారణం.

దేశం కోసం ఎంతో చేసిన రతన్ టాటా.. తన చివరి చర్యను కూడా భారత్ కోసమే చేశారు. టాటా గ్రూప్ ద్వారా ఎన్నో బహుమతులు దేశానికి ఇచ్చిన రతన్ టాటా.. తన చివరి గిఫ్ట్‌గా ఒక గొప్ప బహుమతినే అందించారు. ముంబైలో 200 పడకలు కలిగిన పెట్ (పెంపుడు జంతువుల) హాస్పిటల్‌ను నిర్మించారు. రూ.165 కోట్లతో నిర్మించిన ఈ హాస్పిటల్‌ను గత జూలైలో రతన్ టాటా ప్రారంభించారు. 2017లో ఈ హాస్పిటల్‌ ప్రాజెక్టును మొదలుపెట్టారు.

హాస్పిటల్ ప్రత్యేకతలు

- 24/7 ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూలు

- గాయపడ్డ జంతువుల కోసం లైఫ్ కేర్ సేవలు

- డెర్మలాటజీ, డెంటల్, ఆప్తాల్మాలజీ సేవలు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్