రాష్ట్రీయ స్వయం సేవక్.. షార్ట్ కట్‌లో ఆరెస్సెస్. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది.. భరతమాతకు జై కొట్టాలనిపిస్తుంది.. వందేమాతరం అని బిగ్గరగా నినదించాలనిపిస్తుంది.. ఆ పేరుకు అంత వైబ్రేషన్ ఉంటుంది మరి.
భారత మాత
ఆరెస్సెస్ అంటే..
60,000 వేల శాఖలు
60 లక్షల మంది స్వయం సేవకులు
30,000 విద్య మందిరాలు
3,00,000 మంది ఉపాధ్యాయులు
50,00,000 మంది విద్యార్థులు
90,00,000 బీఎంఎస్ కార్మిక సభ్యులు
50,00,000 లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలు
10 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు
500 వందల అనుబంధ సంస్థలు
1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం
4 వేల మంది దుర్గవాహినీలు
70,00,000 లక్షల మంది విశ్వహిందూ పరిషత్తు సభ్యులు
3,00,000 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు
21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
283 మంది పార్లమెంట్ సభ్యులు
1,460 మంది ఎమ్మెల్యేలు
17 మంది ముఖ్యమంత్రులు
1 రాష్ట్రపతి.. 1 ఉపరాష్ట్రపతి.. 1 ప్రధానమంత్రి.
ఇదీ ఆరెస్సెస్ జాతీయవాదం..!
దేశభక్తులను తయారుచేసే కర్మాగారం..!!
రాష్ట్రీయ స్వయం సేవక్.. షార్ట్ కట్‌లో ఆరెస్సెస్. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది.. భరతమాతకు జై కొట్టాలనిపిస్తుంది.. వందేమాతరం అని బిగ్గరగా నినదించాలనిపిస్తుంది.. ఆ పేరుకు అంత వైబ్రేషన్ ఉంటుంది మరి. కోట్ల మందికి ఆరెస్సెస్ స్ఫూర్తినిస్తుంది. సమాజంలోని ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉందని ఈ సంస్థ విశ్వసిస్తుంది. ఆ అజెండాతోనే ఆరెస్సెస్ నడుస్తుంది. దేశంలో రోజూవారీగా 50 వేల సమావేశాలు జరుగుతాయి. 30 వేల పైచిలుకు వార సమవేశాలు నిర్వహిస్తారు. ఇతరత్రా అనేక బృంద సమావేశాలు జరుగుతాయి. దేశాన్ని ఐక్యంగా ఉంచటం, వసుధైక కుటుంబం అన్న భావనను వ్యక్తపరుస్తూ మున్ముందుకు సాగుతుంది. ఆరెస్సెస్‌లో ఉండే కార్యకర్తలూ సేవాతత్పరత కలిగినవాళ్లే. నిస్వార్థపరులై, అంకితభావంతో సంప్రదాయాలు, విలువలు, సూత్రాలు కలిగినవాళ్లు ఉండటం ఆరెస్సెస్ శక్తి. అందుకే శతాబ్ది చరిత్రలో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేనంత ఎత్తుకు ఎదిగింది.
అయితే, ఇప్పుడు ఆ పరివారాన్ని నడిపించేందుకు ఒక అర్జునుడు అవసరం అయ్యాడా? అంటే అవును! అన్న మాట వినిపిస్తోంది. ఆరెస్సెస్ దూకుడును ప్రదర్శించాల్సిన ఆవశ్యకతను అనేక వర్గాలు నొక్కిచెప్తున్నాయి. ఆరెస్సెస్ ఆవిర్భావం నుంచీ కొన్ని వర్గాల వ్యతిరేకతను ఎదుర్కుంటూనే ఉన్నది. మతం, మతోన్మాదం అని ప్రత్యర్థులు ముద్ర వేసినా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. అయితే, ఇప్పుడు కులగణనను తెరమీదికి తెచ్చిన కాంగ్రెస్.. దాన్నుంచి భారీగా లబ్ధి పొందేందుకు వరుస ఎత్తుగడలు వేస్తోంది. కులగణన జరిగితే రాబోయే రోజుల్లో దేశంలో కులాల కుంపటి ఎలా మండుతుందో ఆ పార్టీకి తెలుసు. దాన్ని క్యాచ్ చేసుకోవటానికి వేచి చూస్తోంది. మరి ఆ అణుబాంబును ఆరెస్సెస్ పెద్దలు ఎలా ఎదుర్కొంటారు? అసలు ఆరెస్సెస్ ఐడియాలజీ ఏంటి? అన్న సంశయం పుట్టింది.
తెలంగాణలో బండి సంజయ్ లాంటి దూకుడైన నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలకు దూరం చేశారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ప్రతిపక్ష హోదాలో బీజేపీయే ఉండేది అన్నది ప్రతి బీజేపీ కార్యకర్త చెప్పిన మాటే. ఉవ్వెత్తున ఎగిసిన లావాను, చెంబెడు నీళ్లు పోసి చల్చార్చినట్టు చల్లార్చి.. తనంతట తానే దెబ్బ తీసుకుంది బీజేపీ. దీనిలో ఆరెస్సెస్ పాత్ర ఎంత? తెలంగాణలో బీజేపీ యువ కార్యకర్తలకు అయినా, రైట్ వింగ్ మద్దతుదారులకైనా బండి సంజయ్ అంటే బలం.. ఒక భరోసా. కానీ, ఆ భరోసా ఇప్పుడు ఎవరు ఇస్తారు? దానికోసం ఆరెస్సెస్ చేపట్టే చర్యలేంటి?
మతోన్మాద శక్తిగా ముద్రపడ్డ ఆరెస్సెస్.. దాన్నుంచి బయటపడాలని బాగా ట్రై చేస్తున్నట్లు కొన్ని సంఘటనలు చెప్తున్నాయి. వేరే మతాన్ని కించపరిచారన్న కారణంతో నుపుర్ శర్మను, రాజాసింగ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించడం (రాజాసింగ్‌ను తిరిగి చేర్చుకున్నా) ఆరెస్సెస్‌కు పెద్ద దెబ్బే. ఆ నిర్ణయం రాజకీయంగా, అంతర్జాతీయ ఒత్త్ళ్లి వల్ల తీసుకున్నా.. బహిష్కరణ అనేది దాని ఉనికినే ప్రశ్నించే చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక.. ఈ మధ్య ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. మసీదు వివాదాలు ఇక చాలు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో గానీ.. ఆ వ్యా‰్యలపై యావత్తు దేశం షాక్‌కు గురైంది. మతం పేరుతో అనవసర వివాదాలు చేయడం, ఇతర మతాల దైవాలను, వారి సంస్కృతిని అవమానించడం, కించపర్చడం హిందూ సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ఒక విధంగా ఆయన అయోధ్య తరహా వివాదాలను ఖండిరచినట్లే లెక్క. ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే.. ఆయన అయోధ్య అంశాన్ని కూడా ఖండిస్తున్నారా? అనే. ఆయన వ్యాఖ్యలు ఒకలా ఉంటే.. ది ఆర్గనైజర్ చెప్పింది మరోలా ఉంది. సోమ్‌నాథ్ నుంచి సంభాల్ వరకు అనేక అంశాలపై చారిత్రక వాస్తవాలు తెలుసుకొనేందుకు పోరాటం చేస్తున్నామని, నాగరిక న్యాయం కోరుతున్నామని పేర్కొంది. మరి భాగవత్ వ్యాఖ్యల మర్మమేంటి?
స్వధర్మ హేతుః సత్పురుషః ( స్వధర్మాన్ని నిలబెట్టేవాడే సత్పురుషుడు) అని చాణక్యుడు చెప్పిన నీతి. అంటే ముందుగా స్వధర్మాన్ని నిలబెట్టాలి. స్వధర్మాన్ని కాపాడుకోవడానికే చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా. అంటే.. తనకు బలమైన హిందూ ధర్మాన్ని అది కాపాడుకోవాలి. ఇక్కడ ఒక అంశాన్ని ఉదాహరణగా చెప్పుకోవాలి. తెలంగాణలో బీఆర్‌ఎస్ బలం ఏంటి? అంటే తెలంగాణే. ఆ తెలంగాణవాదాన్ని దూరం చేసుకుంది ఆ పార్టీ. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మారింది. దాంతో తెలంగాణవాదులు హర్ట్ అయ్యారు.. బీఆర్‌ఎస్ అట్టులా మాడిపోయింది. బీఆర్‌ఎస్ తన బలాన్ని తానే విసిరికొట్టింది. సేమ్ టు సేమ్.. ఆరెస్సెస్‌కు కూడా ఇది వర్తిస్తుంది. తన బలం ఏంటో దాన్నే నమ్ముకుంటే మనుగడ సాగిస్తుంది. అలా మనుగడ సాగించాలంటే శ్రీకృష్ణుడికి అర్జునుడిలా.. మోదీ శిష్యుడిగా ఒక యోగి ఆదిత్యనాథ్ కావాలి. ఒక ఫైర్ బ్రాండ్ దేశ రాజకీయాల్లోకి రావాలి. ఆరెస్సెస్‌కు, ఒక రాజకీయ పార్టీ (బీజేపీ)కి ఏం సంబంధం అని ఆరెస్సెస్ పెద్దలు అనవచ్చు. కానీ.. బీజేపీ పునాదులు ఎక్కడివి.. ఆ వేర్లు తనవే అయినప్పుడు సంబంధమేంటి? అని ఎలా ప్రశ్నించగలరు?
- శ్రావణ్ కుమార్ బొమ్మకంటి