పార్లమెంట్ చరిత్రలో తొలిసారి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. రాజ్యసభ చైర్మన్ తీరు సరిగా లేదని ఆరోపిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశాయి.
రాజ్యసభ చైర్మన్ ధన్కర్
న్యూఢిల్లీ, ఈవార్తలు : పార్లమెంట్ చరిత్రలో తొలిసారి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. రాజ్యసభ చైర్మన్ తీరు సరిగా లేదని ఆరోపిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశాయి. ధన్కడ్ తీరును ఆక్షేపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ, ఆప్‌తో పాటు ఇండియా కూటమి నేతలు మద్దతు ఇచ్చారని తెలిపాయి. తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉండగా, తమకు 70 మంది ఎంపీలు మద్దతు ఉందని కాంగ్రెస్ నేత రణజీత్ రంజన్ చెప్పారు. ధన్కడ్ తీరు విపక్షాలను ఇబ్బందులు పెట్టేలా ఉందని, అందుకే ఎంతో బాధతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని వివరించారు.
మరోవైపు, పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా ఎంపీలు పనిచేయాలని.. అంతా సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. కానీ, గత కొన్ని రోజులుగా విపక్షాల తీరు ఆందోళనకరంగా ఉందని మండిపడ్డారు.