ఎగ్జిట్‌ పోల్‌ కాదు.. మోదీ మీడియా పోల్‌ : రాహుల్‌ గాంధీ

అవన్నీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కాదని, మోదీ మీడియా పోల్‌ అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్‌ ఒకటో తేదీన వెలువడిన ఫలితాలన్నీ మోదీ సర్వే ఫలితాలని అని పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. అవి ఎగ్జిట్‌ పోల్‌ కాదని, మోదీ మీడియా పోల్‌ అని స్పష్టం చేశారు.

rahul gandhi

రాహుల్‌ గాంధీ


దేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందంటూ అనేక ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించాల్సిందిగా జాతీయ మీడియా సంస్థలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానాన్ని ఆయన ఇచ్చారు. అవన్నీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కాదని, మోదీ మీడియా పోల్‌ అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్‌ ఒకటో తేదీన వెలువడిన ఫలితాలన్నీ మోదీ సర్వే ఫలితాలని అని పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. అవి ఎగ్జిట్‌ పోల్‌ కాదని, మోదీ మీడియా పోల్‌ అని స్పష్టం చేశారు. జూన్‌ నాలుగో తేదీన కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని రాహుల్‌ గాంధీ ఽధీమాను వ్యక్తం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్