ఆస్తులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్తులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తికి చెందిన ప్రైవేట్ ఆస్తిని సమాజానికి చెందిన మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించలేమని స్పష్టం చేసింది.

supreme court

సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఈవార్తలు : ఆస్తులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తికి చెందిన ప్రైవేట్ ఆస్తిని సమాజానికి చెందిన మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచీ మంగళవారం విచారణ సందర్భంగా.. పై వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 39 (బీ)ని పరిగణనలోకి తీసుకొని తీర్పు చెప్తున్నట్టు వెల్లడించింది. ‘ప్రైవేట్ ఆస్తి వనరులు సమాజానికి సంబంధించిన మెటీరియల్ రిసోర్స్‌గా మారవచ్చు. కానీ, ప్రైవేట్ వ్యక్తికి చెందిన ప్రతి మెటీరియల్ రిసోర్స్ సమాజానికి సంబంధించినది కాబోదు’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు 8:1 మెజారిటీతో తీర్పు చెప్పింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్