Neet UG 2024 Results | ఎట్టకేలకు నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
Neet UG 2024 Results | న్యూఢిల్లీ : ఎట్టకేలకు నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఫిజిక్స్‌లో కలిపిన మార్కులను తొలగించారు. దీంతో 4 లక్షల మంది విద్యార్థులు 5 చొప్పున మార్కులు కోల్పోయారు. అంతేకాకుండా రెండు రోజుల్లో మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. కాగా, విద్యార్థులు తమ ఫలితాలను exams.nta.ac.in/NEET/ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు.
కాగా, నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులకు ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావటం సంచలనం రేపింది. మే 5 న పరీక్ష నిర్వహించగా, జూన్ 4న ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 13,31,321 మంది విద్యార్థినులు, 9,96,393 మంది విద్యార్థులు, 17 మంది ట్రాన్స్ జెండర్లు పరీక్ష రాశారు.