దేశ వ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తేదీని కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 22న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పీజీ పరీక్ష కూడా వాయిదా వేసింది.
నీట్ పీజీ పరీక్ష
దేశ వ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తేదీని కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 22న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పీజీ పరీక్ష కూడా వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా 300 నగరాల్లో వెయ్యికిపైగా పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ-2024 పరీక్ష జరగాల్సి ఉంది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ విధానంలో నిర్వహించాల్సిన ఈ పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే రాత్రికి రాత్రే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కనీసం రెండు మూడు రోజులు ముందుగా అయినా ఈ సమాచారాన్ని అందించాల్సి ఉందని, పరీక్ష ఉందన్న ఉద్దేశంతో ముందు రోజే చాలా చోట్ల అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఉన్న ప్రాంతాలకు వెళ్లారని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా, ఉంటే ఈనెల 18న నిర్వహించిన యుజిసి నెట్ - 2024 పరీక్షను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్ష జరిగిన మరి షిఫ్ట్ రోజే యూజీసీ నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం డార్క్ నెట్లో లీక్ అయినట్లు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడంతో పారదర్శకతను కాపాడటం కోసం పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. మళ్ళీ యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్వహించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించాల్సిన సిఎస్ఐఆర్ యుజిసి నెట్ పరీక్షను కేంద్రం ఈ నెల 21న వాయిదా వేసినట్లు ప్రకటించింది.
నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం మారిన నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్ పదవి నుంచి శుభోద్ కుమార్ పై కేంద్రం వేటు వేసింది. దేశంలో రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు నేపథ్యంలో శనివారం రాత్రి ఆయనను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుబోద్ స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా కేంద్రం నియమించింది. తదుపరి ఆదేశాలు జారే చేసే వరకు ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవులో కొనసాగనున్నారు. గతేడాది జూన్లోనే ఎన్టిఏ డైరెక్టర్ జనరల్ గా శుభోద్ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అడిషనల్ సెక్రటరీగా ఆయన పని చేశారు.