మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి హ్యాట్రిక్ రికార్డు సాధించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారు.
న్యూఢిల్లీ, ఈవార్తలు: దేశ చరిత్రలో మరో రికార్డు నెలకొంది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి హ్యాట్రిక్ రికార్డు సాధించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ రోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధాని సహా 68 మంది కేంద్ర మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు,బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.
ప్రధానమంత్రి: నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు: రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మల సీతారామన్, ,సుబ్రమణ్యం జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయుష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, శర్బానంద్ సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషీ తదితరులు ఉన్నారు.