భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా justice sanjeev khanna ప్రమాణం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.

cji sanjeev khanna

జస్టిస్ సంజీవ్ ఖన్నాతో సీజేఐగా ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, ఈవార్తలు : సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా justice sanjeev khanna ప్రమాణం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంలో ముగియటంతో సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. ఆయన 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఈయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందే.. సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందిన అతికొద్దిమందిలో ఈయన ఒకరు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ట్యాక్సేషన్, ఆర్బిట్రేషన్, కమర్షియల్, కంపెనీ లా తదితర కేసులు వాదించారు. 2005 జూన్‌ 25న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా పలు విభాగాల్లో సేవలు అందించారు.

సీజేఐ సంజీవ్ ఖన్నా తీర్పులు ఇవీ..

- సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇప్పటి 117 తీర్పులు రాశారు.

- 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములు

- ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. 

- ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్