నవోదయ విద్యాలయ సమితి NVS జేఎన్వీఎస్టీ 2025 ఫలితాలను విడుదల చేసింది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన LEST 2025, JNVST 2025 పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్సైట్‌లో తెలుసుకోవచ్చని వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
నవోదయ విద్యాలయ సమితి NVS జేఎన్వీఎస్టీ 2025 ఫలితాలను విడుదల చేసింది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన LEST 2025, JNVST 2025 పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్సైట్‌లో తెలుసుకోవచ్చని వెల్లడించింది. navodaya.gov.in వెబ్సైట్‌లో రిజల్ట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపింది. స్కోర్ తెలుసుకునేందుకు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలని సూచించింది. ఫలితాల కోసం navodaya.gov.in లేదా cbseitms.nic.in లేదా nvsadmissionclassnine.in ను సంప్రదించాలని తెలిపింది. క్వాలిఫై అయిన విద్యా్ర్థులు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు (డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్) గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు
- నివాస ధ్రువీకరణ పత్రం (Proof of residence)
- జనన ధ్రువీకరణ పత్రం (Date of birth certificate)
- కుల ధ్రువీకరణ పత్రం (Caste/category certificate (for SC/ST/OBC candidates))
- దివ్యాంగ సర్టిఫికెట్ (Disability certificate) (దివ్యాంగులకు మాత్రమే)
- రూరల్ కోటా సర్టిఫికెట్ (Rural quota certificate) (అర్హులకు మాత్రమే)
- మెడికల్ ఎగ్జామినేషన్ క్లియరెన్స్ (Medical examination clearance) (9వ తరగతిలోకి ప్రవేశాలకు)