Law Tip | హోటల్‌కి వెళ్తే టిప్ అడుగుతున్నారా.. కచ్చితంగా ఇవ్వాలా.. ఏయే దేశాల్లో ఎలా ఉందంటే..

వీకెండ్‌ అనో.. బర్త్ డే, మ్యారేజ్ డే.. లేదా ఇంకేదో అకేషన్ అని హోటల్‌కు వెళ్తుంటాం. ఇష్టం ఉన్నవి ఆర్డర్ చేసుకొని తింటాం. దానికి బిల్లు కడతాం కానీ.. బిల్లు కట్టేటప్పుడు వెయిటర్ వచ్చి టిప్ అడుగుతుంటారు. కొందరైతే డిమాండ్ చేస్తుంటారు. కొన్ని రెస్టారెంట్లు అయితే ఏకంగా సర్వీస్ చార్జ్ వేస్తుంటాయి.

law tips

ప్రతీకాత్మక చిత్రం

లా టిప్స్, ఈవార్తలు : వీకెండ్‌ అనో.. బర్త్ డే, మ్యారేజ్ డే.. లేదా ఇంకేదో అకేషన్ అని హోటల్‌కు వెళ్తుంటాం. ఇష్టం ఉన్నవి ఆర్డర్ చేసుకొని తింటాం. దానికి బిల్లు కడతాం కానీ.. బిల్లు కట్టేటప్పుడు వెయిటర్ వచ్చి టిప్ అడుగుతుంటారు. కొందరైతే డిమాండ్ చేస్తుంటారు. కొన్ని రెస్టారెంట్లు అయితే ఏకంగా సర్వీస్ చార్జ్ వేస్తుంటాయి. మరి.. టిప్ కచ్చితంగా ఇవ్వాలా? చట్టంలో దానికి చట్టబద్ధత ఉందా? అంటే.. భారత్‌లో టిప్ అడగటం చట్టబద్ధం కాదు. హోటల్స్, రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ టిప్ డిమాండ్ చేయరాదు. కస్టమర్లు ఇస్తే తీసుకోవాలి. లేకపోతే లేదు. సర్వీస్ చార్జ్ వేయడం కూడా అసంబద్ధ వాణిజ్యమే. కస్టమర్లను సర్వీస్ చార్జ్ కట్టాలని బలవంతం చేస్తే నేరం కిందే లెక్క. మెనూలో సర్వీస్ చార్జి గురించి ఉన్నా.. కస్టమర్లు సర్వీస్ చార్జ్ కట్టకుండా ఉండవచ్చు. 2022 జూలై 4వ తేదీన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ).. సర్వీస్ చార్జ్‌ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు.. కస్టమర్లను వెయిటర్స్ టిప్స్ డిమాండ్ చేయడం కూడా నేరమే.

ఒక వేళ రెస్టారెంట్లు సర్వీస్ చార్జ్ బిల్లులో జత చేస్తే.. తొలగించాలని కస్టమర్లు డిమాండ్ చేయవచ్చు. అయినా పట్టించుకోకపోతే.. నేషనల్ కన్య్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 1915 నంబర్‌కు కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు. ఎన్‌సీ‌హెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. www.edaakhil.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కంప్లెయింట్ రిజిస్టర్ చేయవచ్చు.

అమెరికాలో టిప్స్ ఇలా..

అమెరికాలో టిప్ అనేది సర్వసాధారణం. టిప్ ఇవ్వడం చట్టబద్ధం కాకపోయినా కచ్చితం అయిపోయింది. ఉత్తర అమెరికా ప్రాంతాల్లోనైతే టిప్స్ సంస్కృతి మరీ ఎక్కువైంది.

ఫ్రాన్స్‌లో ఇలా..

ఫ్రాన్స్‌లో హోటల్స్ సర్వీస్ కాంప్రీస్ అన్న పేరుతో సర్వీస్ చార్జీలను బిల్లుల్లో వేస్తున్నారు.

జపాన్‌లో ఇలా..

జపాన్‌లో టిప్పింగ్ అనేదానిని అక్కడి సిబ్బంది ఇబ్బందిగా పరిగణిస్తారు. టిప్ రహిత సేవలను అందిస్తారు. ఒకవిధంగా టిప్ ఇస్తే నేరంగా చూస్తారు. ఒకవేళ విదేశీయులు టిప్ ఇచ్చినా.. వాళ్లను వెంటబడి మరీ ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తారు.

ఈజిప్టులో ఇలా..

ఈజిప్టులో బక్షీష్ అంటారు. ట్యాక్సీ డ్రైవర్ దగ్గరి నుంచి రెస్టారెంట్ వర్కర్లు, హోటల్ డోర్ ఓపెనర్లు, బాత్రూం అటెండెంట్లు ఇలా.. ప్రతీ ఒక్కరు టిప్ అడగడం సాధారణంగా కనిపిస్తుంది.

చైనాలో ఇలా.. 

చైనాలోనూ టిప్ లాంటి ఉదార చెల్లింపులను ఆశించరు. వీలైనంత ఎక్కువగా దూరంగా ఉంటారు. ఒక్కప్పుడు ఇక్కడ టిప్పింగ్ నిషేధించారు. అయితే, ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో మార్పులు వస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్